పుట:హాస్యవల్లరి.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భీ - (కోపంతో) ఏమీలేదనే నేనూ అంటూంటా! ఏమీ లేదు, నెయ్యీలేదు. తిన్నగా నెయ్యివేస్తావా, మరేమన్నా కావాలా! .

136

కాఫీహోటల్లో ఒక కాఫీపాయి తన కాఫీ తిరగాబోర్లా పోసుగుంటూ పక్కాయన మోఖంకేసి చూసి,

కా - కళ్లెర్రగా ఉన్నాయేమండీ?

ప - రాత్రి, నాటకానికి వెళ్ళానండి.

కా - ఏం నాటకం?

ప - భీమాంజనేయం.

కా - ఎల్లాఉంది?

ప - వాళ్ళ మొహంలాఉంది. చెప్పుచ్చుగుని కొడ్దామనుకున్నానుగాని, కొట్టలేదు.

కా - ఏం?

ప - అప్పుడు నా కాలిని జోడు లేకపోయింది.

కా - ఆరెరే, అప్పుడు నా కాలికి కొత్తపైజార్లు సిద్ధంగా ఉన్నాయిస్మండి. ఆక్షణంలోనే మీరు నా దగ్గరికి రావలిసింది. స్టేజిలోకి.

137

క్షౌరప్రసంగంవచ్చి, స్నేహితులతో,

కిష్ట్రావు - మామంగలి క్షౌరంచెయ్యడం ముగించిన తక్షణం మొహం చూస్తే. నిన్న చేసినట్టుంటుంది.

అప్రావు - మావాడు క్షౌరం కానిచ్చిన మొఖాన్ని పరిశోధించినా సరే, అసలు క్షౌరం చేసినట్టే ఉండదు.

సుబ్రావు - మామంగలి క్షౌరంచేసిన మొహం రేపటెల్లుండి క్షౌరం కాబోయే మొహంలాగ ఈవేళే ఉంటుంది. పైపెచ్చు! నిమిషం!

138

సినీమాలో ఒక కథపట్లు ముగిసే సందర్భంలో మోటారు కారు ఒకటి జనంతో సహా అమాంతంగా పర్వతాల మీంచి దొర్లి సముద్రంలోకి పడిపోగా ప్రేక్షకుల్లో ఉన్న ఒక శాస్త్రి పక్కనున్న బంధువు రావుగారితో,

శా - (చప్పరిస్తూ) ఆఁ, బూటకం, అసంభవం. అంతమంది చచ్చిపోతారా? అబద్దం.

రా - ఇందాకణ్ణించి జరిగిందిమాత్రం అబద్దంకాదా?

శా - (కొంచెం చికాకుపడి) అవుననుకో! -

రా - అయినప్పుడు నీకు బాధ ఎందుకూ?

శా - (కాస్త ఆలోచించుగుని, ఏదో ఓటి చెప్పదలచి) ఈ అబద్దం మరీ కారురకం!

139

అరణ్యం - ఆరి! ఏమీ సర్కస్‌రా! అన్నీ ఓ యెత్తూనూ, మొన్నరాత్రి, ఆమోటారు 'జంపు' దాటు - ఓయెత్తూనూ! అతనెప్పుడూ అందుకు సిద్ధం అయేఉంటాట్టస్మీ, 'విల్లూ' అదీ రాసేసి!

కాంతం - నువ్వు విన్లేదూ! పాపం వాడు గతించాట్ట. పట్నంలో, ఈవేళ.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

104

హాస్యవల్లరి