పుట:హాస్యవల్లరి.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెల్లనివన్నీ పాలుకావు. మెరిసేదంతా బంగారం కాదు. రంగే ప్రధానంకాదు, డబ్బే శాశ్వతంకాదు. మీరు పైడాబు ప్రచారాలు చూసి అక్కడికీ అక్కడికీవెళ్ళి టోపీ పడకండి. మమ్మల్ని ఒఖ్ఖసారి మచ్చుచూడండి, మీకే తెలుస్తుంది.

117

సోమయాజులు - ఊC, అల్లాయితే నువ్వు మెడ్రాసులో ప్రతిరోజూ తిరగడమే అందూ!

శర్మ - ఓ.

సో - దేనిమీద?

శ - మెల్లిన్సు ఆహారం మీద.

సో - ఓరి నీ దుంపతెగా, దానిమీద తిరగడం ఎల్లా?

శ- నిజమేరా. మళ్ళీ మాట్లాడితే - చేతితో తాకని - కూడానూ.

సో - ఓరి అదా! టిక్కట్టు ఎల్లా ఉంటూండేది?

శ - కానిదగ్గర్నించి బేడదాకా.

సో - అల్లా చెప్పూ! ట్రామా!

శ - మరే, కాని నే ఎక్కుతూండే దాని పేరు మాత్రం మెల్లిన్సే.

118

ఓ ముసలమ్మగారు తనయింటికొచ్చిన ముగ్గురు చుట్టాలకి అన్నం పెడుతూ, గరిటి అంటల్లో ఉన్నందువల్ల, రాచ్చిప్పతోనే చారునీళ్ళు వడ్డించబోయి. అది మొదటాయన విస్తట్లోనే ఇట్టీవంచగా, ఆయన తనకి చుక్కేనా కిట్టక తెల్లపోయినమీదట రెండో ఆయన తనకి దక్కినబాపతు గబగబా కలుపుగుంటూ తక్షణం మూడో ఆయన చెవులో,

ఆవిడ రాచ్చిప్ప నా విస్తట్లో వంచినప్పుడే నువ్వు చెయ్యట్టి సొమ్ముచేసుగో, నీవిస్తట్లో వంచిందాకా తేభ్యంలా చూస్తూంటావా నీ పని అంతే, నీకు ఆనక వట్టి పచారుతప్ప చారుండదు. పైన నీ యిష్టం.

119

తండ్రి - ఇదుగో పంతులుగారు, నమోన్నమః.

పం - చిత్తం.

తం - మా కుంక ఈ యేడేనా మాట దక్కించేనా, కాస్తా?

పం - ఫర్వాలేదండి,

తం - లేకపోతే ఆ దిక్కుమాలిన స్కూలిపైను పరీక్ష ఊరుకుంటుందా, మూడోమాటు!

పం - ఫర్వాలేదండి.

తం - అది గనక జరిగితే అక్కడికి మూణ్ణిద్దర్లూ అవుతాయి గనక దేశాంతరం లేచిపోవాలి.

పం - ఫర్వాలేదండి,

పం - అయితేనూ ముదురు వయస్సువాళ్ళని ఇహ చదివి ఫేలుకానీర్షేం?

పం - ఫర్వాలేదండి.

తం - ఎమో, మొత్తానికి మీరు నసుగుతూనే ఉన్నారు. మావాడిమాట నిష్కర్షగా చెప్పారుకారు.

పం - ఫర్వాలేదండి, అటు విజయనగరం విశాఖపట్నం లగాయితు ఇటు నెల్లూరూ గూడూరూ వరకూ ప్రతివిద్యార్థి ప్యాసయితే మీవాడు కూడా ప్యాసు కావాలి మరి.

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

98

హాస్యవల్లరి