పుట:హాస్యవల్లరి.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్ర - మహమ్మండా, అబద్దమా! ఫర్లాంగు దూరాన్నించి ముష్టికి చెయ్యట్టి నా వెనుకాలే రాలేదూ?

త - ఒస్, చెయ్యట్టడమా! అది చిన్నతనంలో స్కూల్లో అలవాటు! స్వంత అలవాటు పట్టుగోడం కష్టం. సెలవు..

100

సంబంధాల కోసం తిరుగుతూ, ఒకాయన. ఒక బియే విద్యార్థి చదువుకొట్టులోకి వెళ్ళి, అతడితో ముచ్చటిస్తూ,

ఆయన - ఇదండి స్థితి!

విద్యా - ఆఖరమ్మాయికి ఎన్నేళ్ళన్నారూ!

ఆ - తొమ్మిది! కట్నం, ఏ తంటాలోపడి వెయ్యిస్తా, దానికంటే పైపిల్ల ఉంది, రమారమిగా పదకొండేళ్ళది - దానికి మరొహ అయిదువందలిస్తా? దాని పై పిల్ల ఉంది, కట్టుతప్పి, క్షణమేనా ఇహ ఉంచాయిస్తు కాకుండానూ - దానికి రెండు సంచులిస్తా ! మరి ఎంజెయ్యెను! దానికి పదమూడూ వెళ్లే పోయాయి.

విద్యా - అల్లాయితే తమవద్ద ఒఖ్ఖ ఇరవై యేళ్ళ పిల్లలేదేం పెళ్ళికి?

ఆ - ఇవేం మాటలయ్యా, ఎక్కడో పోఖిరీ రకంలా ఉన్నావు.

వి - వెళ్ళండి, వెళ్ళండి! ఊరికేఅన్నాను. మా అమ్మాయి సంబంధం గురించి నేనూ తిరగాలి!

101

ఒక జన మందిరంలోని ఆవరణయొక్క ఒకభాగంలో “ఈవైపునకు ఎవ్వరును రాకూడదు” అని రాసిన బల్లకట్టి ఉన్నప్పటికీ, ఒకనాడు చీకటిపడ్డతరవాత, ఇద్దరు గుసగుస లాడుతూవెళ్ళి అక్కడచేరి మాట్లాడుకుంటూండగా, ఆరోజున శివామని కాఫీకేనా లంచం దొరకని ఒకనెంబరు భంట్రోతు అక్కడికి డ్యూటీనెపంమీద ఏమన్నా వడుక్కోవచ్చుగదా అని వచ్చి,

భం - ఏయ్! ఎవరిది?

వ్యక్తుల్లో ఒకరు - మేం.

భం - మేమేమిటి? మీరిక్కడికి ఎల్లావచ్చారు?

వ్య - ఈ దారెమ్మటే నడిచి వచ్చాం!

భం - ఇది దారికాదే, “కళ్ళాపట్లా!” అక్కడ నోటీసుంది చూసుగోవాలని తెలియదూ?

వ్య - అక్కడ నోటీసున్నట్టు తెలియడానికి లైటు లేదు, చీకటిగా ఉంది, పైగా మీమనిషేగావును ఓడుండి మే వస్తూంటే ఊరుకున్నాడు!

భం - అబ్బో! చాలా రూల్సు మాట్లాడుతూండావే?

వ్య - మీరే రూల్సు మాట్టాడింది, ఏంకావాలో చెప్పకుండానూ?

భం - అల్లాయితే నీ పేరేముటో చెప్పెయ్, రాసేస్తాను, నీ జలుబు ఏమన్నా ఉంటే వొదిలిపోతుంది!

వ్య - నా పేరు అర్బుదం! అసలు నాకు మనస్సు చికాకుగా ఉంది. ఈవిడ నాభార్య!

భం - (కొంతతగ్గి) అయినాసరే నోటీసుచూడాలి (అని బ్యాటరీలైటు నోటీసుబ్లమీద వేసి), “ఈవైపునకు ఎవ్వరును రాకూడదు” (అని చదివాడు).

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

93

హాస్యవల్లరి