పుట:హరివంశము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

హరివంశము


మందవిచారుఁ డుద్యమసమగ్రతమైఁ జనుదెంచెఁ గుంజర
స్యందనఘోటక[1]ప్రకటసైన్యసమూహవిజృంభణంబునన్.

168


వ.

ఆ సమయంబున నేను శంతనుండు లోకాంతరగతుం డైన నతనికి బితృమేధంబు
నడపుచు [2]ధరణీశయనప్రముఖవ్రతంబు లవలంబించియుండ నమాత్యులు సేనా
పతులు నుత్సాహులై శోకింప దద్దురాత్ముండు దూతం బుత్తించిన వాఁడు
తద్వాక్యంబులుగా నాయెదుర ని ట్లనియె.

169


క.

నీమాఱుదల్లి త్రిభువన, భామారత్నంబు గంధవతిపై నాకున్
గామంబు గలదు భీషుఁడ, యేమియు నన లేదు వేగ యి మ్మావెలఁదిన్.

170


ఆ.

ఇట్లు సేసితేని యిలయును రాజ్యంబు, [3]ధనము నిపుడు నీకుఁ దక్కు వేఱ
దుర్విమోహపరత గర్వంబు సూపిన, బ్రతుకు డరిడి యొండు పలుకు లేల.

171


క.

నాచక్రముపేరు వినిన, రాచకొడుకు లెల్లఁ దమదురాచఱికంబుల్
వే చెడిపోవఁగఁ బాఱుదు, లేచి నిలిచిరేనిఁ జత్తు రెఱుఁగవె దీనిన్.

172


మ.

అని యి ట్లగ్నివిషోపమంబు లగు దుష్టాలాపముల్ వీను లొం
దినఁ జిత్తం బెరియంగఁ గ్రోధము సముద్దీప్తంబుగా సైఁప[4]లే
క నిరోధోద్దతబుద్ధి నక్షణమ సేనాధ్యక్షులున్ సర్వవా
హినుల సన్నహనంబు సేయుఁ డని యుద్ధైకాగ్రహవ్యగ్రతన్.

173


వ.

విచిత్రవీర్యసమేతంబుగా [5]వెలువడునెడ మంత్రకోవిదు లగుమంత్రులు, క్రియా
వేదు లగుఋత్విక్కులును నిత్యహితకాము లగుసుహృదులుం గూడి నన్నుఁ
బరివేష్టించి.

174


సీ.

శాత్రవుఁ డత్యుగ్రచక్రహస్తుండు నీవు సూతకి వై కాయశుద్ధి లేక
యున్నాఁడ వకట యాయుధము [6]లంటగఁరాదు దివ్యాస్త్రములఁ బ్రవర్తింపరాదు
తొలుతఁ గయ్యమునకుఁ దొడఁగుటయును నీతిబాహ్యంబు ప్రస్ఫుటోపాయవిధుల
సామభేదాదినిశ్చయమునఁ జరియించి పోరామియైనప్డు పోరు డొప్పుఁ


తే.

గాన యిప్పటి కొకభంగిఁ గాలయాప, నంబు గావింపఁ జతురజనంబుఁ బుచ్చు
[7]మవులఁ బితృకార్య మేదిన నతులశుభము, లెల్లఁ గైకొని వెడలి జయింపు పగతు.

175


క.

తగువార లిట్లు చెప్పిన, తగవులు వినకునికి సాలఁ దగ దని నన్నున్
మగుడించి చనిరి చెచ్చెరఁ బగతుకడకు దూతవృత్తిఁ బండితజనముల్.

176


వ.

చని యనేకవిధంబుల ననునయించియు భేదించియు వివిధవస్తునిరూపణంబులఁ
బ్రబోధించియు నద్దురాత్ము సుముఖుం జేయనేరక చిక్కువడియుండ నుక్కు
మీఱి యక్కుటిలుండు చటులసంచారనిర్వక్రం బగు చక్రంబు మాపై
బ్రయోగించిన.

177
  1. ప్రకర
  2. ధరణీవ్రతంబు
  3. ధనము నీకుఁ దక్కు
  4. లే కనిలో నుద్ధత
  5. వడలు
  6. పట్టఁగరాదు
  7. మెలమిఁ బితృకార్య మే దన నతులవిభవ, మెల్ల