పుట:హరివంశము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 1.

39


నివారణార్థం బగువాక్యం బుగ్గడించుట కారణంబుగా నుమాభిధానం బాయ
మకుఁ ద్రైలోక్యవిదితం బయ్యె నివ్విధంబునఁ దపస్సిద్ధి వడసి కన్యారత్నంబులు.

107


చ.

అతులితనిత్యయావనము నద్భుతయోగబలోదయంబు శా
శ్వత మగుబ్రహ్మచర్యము నవంధ్యము లై తముఁ జెంద సజ్జన
ప్రతతులు [1]లోకపూజ్య లని ప్రస్తుతి సేయఁగఁ దత్త్వబోధవి
చ్యుతభవబంధనం బగుయశోవిభవంబునఁ బేర్చి రందఱున్.

108


తే.

వారిలోనఁ బెద్దాయమ భూరిపుణ్య, యయ్యుమాదేవి సర్వలోకైకజనకు
నమ్మహాదేవుఁ జెంది యర్ధాంగభాగ, [2]యై యనన్యమాహాత్మ్యధన్యత వహించె.

109


వ.

అప్పరమేశ్వరికిఁ గృత్రిమపుత్రుం డైనశుక్రుండు [3]యోగాశ్రయుండై పరఁగె
రెండవయాయమ యేకపర్ణ [4]యసితునకు భార్యయై దేవలుం గనియెఁ దృతీయయైన
యేకపాటల [5]జైగీషుం డనుభవ్యమునిం బొంది శంఖ[6]4లిఖితులం గాంచె శుక్ర
ప్రముఖు లయిన వీరందఱు [7]యోగవిద్యాప్రవర్తకులు మఱియును.

110


సీ.

అనఘ యగ్నిష్వాత్తు లనఁ మరీచిపుత్రులు దేవగణసేవితులు పితరులు
సోమమయా[8]ఖ్యవిశ్రుతలోకనిత్యవాసులు వారిమానససూతి యైన
కన్య యచ్ఛోద నాఁ గలిగి యచ్ఛోదసరస్సుఁ బుట్టించె నారమణియొక్క
తఱి నాత్మజనకుఁ డంతర్ధానమునఁ బొంది యుండంగఁ గానక యుదితతేజుఁ


ఆ.

డద్రికాభిధాన యగునచ్చరయుఁ దాను, వరవిమానమున దివంబునందుఁ
గరము వెలుఁగునుపరిచరు నింద్రతుల్యునిఁ, గాంచి వాంఛితంబు గడలుకొనఁగ.

111


క.

ఈతనికిం గూఁతు రగుట, యేతపముఫలంబొ యనుచు నిచ్చఁ దలఁచి తా
నాతప్పున యోగచ్యుత, యై తూలి యధోముఖిత్వ మంది యడలఁగన్.

112


తే.

భాను[9]బింబంబుతో నుపమాన మగువి, మానములఁ ద్రసరేణుప్రమాణదేహు
లై [10]వెలుంగుచుఁ దోచి రాయమపితరులు, కావరే యని పలికె నక్కన్యకయును.

113


క.

వా రోడకు మని దానిని, ధారిణిపైఁ బడకయుండఁ దగ నిల్పుటయున్
గోరి యది ప్రస్తుతించినఁ, గారుణ్య మెలర్ప నయ్యఖండితతేజుల్.

114


వ.

అవశ్యభావి యైనయయ్యర్థంబు తమయోగదృష్టిం జూచి యక్కన్నియతో
నమ్మా నీ కొక్కటి సెప్పెదము దేవదానవమానవలోకంబులం దెవ్వరికిం దమ
చేసినకర్మఫలం బనుభవింపక పొలియదు నీవు వసువుం దండ్రిగాఁ గోరితివి గావున
నతని కూతురువై యష్టావింశతితమం బగు ద్వాపరయుగంబున నీయద్రిక మత్స్య
రూపధారిణియై యుండఁ దదీయోదరంబున జన్మింపంగలదాన [11]వప్పుడు.

115
  1. లోకమాత
  2. మయ్యె నన్యమహితత, మహత్త్వ
  3. యోగభావ్యుండై; చారుండై
  4. యసీత్తునకు
  5. జైగీషవ్యుండను
  6. కలికులం
  7. ఒక ప్రతిలో యోగవిద్యాప్రవర్తులని స్త్రీలకే చెప్పియున్నది గాని వారిపుత్త్రులకుఁ గాదు. మఱియొకప్రతిలో వీరిద్దరే యాచార్యు లని గలదు.
  8. ఖ్యాతసుర
  9. బింబంబునకు
  10. యెలమితోడఁ
  11. వందు