పుట:హరివంశము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2

33


వ.

ఇవ్విధంబునం బగ నిశ్శేషంబు గావింపం బ్రతిన సేసి కల్పాంతరౌద్రుం డగు
రుద్రుండు భూతజాతంబు బారిసమరుభంగిఁ గసిమసంగి శకయవనకాంభోజ
పారదపహ్లవులం బొడిసేయ వారు గెరలి యాసగరగురుం డగు వసిష్ఠమహాముని
శరణంబు సొచ్చి యభయంబు వేఁడిన.

58


క.

ధీరుఁ డొకతీరుతోడను, వారలఁ జేకొని కకుత్థ్సవంశవరేణ్యున్
వారించిన నతఁడును విని, ప్రారంభము గురునిపంపుఁ బరికించి తగన్.

59


వ.

అవ్విరోధులం బరిభవించి విడుచుటయ చంపుట యగు నని తలంచి శకులశిరంబులు
గొఱిగి ముఖరోమచయంబులు నిలిపి యవనకాంభోజుల మస్తకంబులు
సర్వముండితంబులు సేసి పారదుల ముక్తకేశులం గావించి పహ్లవుల ననవర
తశ్మశ్రుధారులుగాఁ బనిచి తత్సంబంధు లగుకోలిసర్పుల మాహీషుకులదార్వులఁ
[1]జోళులం దాదృశులుగా నాజ్ఞాపించె. వీరెల్లం దొల్లి యుత్తమక్షత్రియు
లా రాజశ్రేష్ఠుందు వసిష్ఠవచనంబున నిట్టు తదీయధర్మధ్వంసం బొనర్చుట నది
మొదలు వేదాధ్యయనయజనప్రముఖంబులకు బాహ్యులై మ్లేచ్ఛులం గలసిరి
తదనంతరంబ.

60


సీ.

ఔర్వునివశమున నాత్మీయభార్యల [2]నొకతెకుఁ దుంభీఫలోదరమున
నఱువదివేవు రుద్యతతేజులును మఱియొక్కతె కాత్మజుం డొక్కరుండ
పంచజనుఁ డనంగఁ బరఁగి యన్వయకరుఁ డగువాఁడు కలుగుట నన్నరేంద్రుఁ
డఖలదిక్కులు ప్రతాపాఢ్యుఁడై సాధించి తను ధర్మవిజ[3]యి యీతఁడ యనంగ


తే.

నతుల[4]కీర్తి నున్నతి గని యశ్వమేధ, దీక్ష గైకొని యశ్వంబుఁ ద్రిప్పి తేరఁ
బనిచె నందఱుఁ గొడుకుల వినుము వారు, వీరులై యవ్విధంబు గావించుచుండ.

61


వ.

ప్రాగ్దక్షిణజలధితీరంబున నత్తురంగంబు నింద్రుం డపహరించి రసాతలంబున డాఁచుటయు.

62


తే.

తండ్రిపనుపున నందఱు ధరణియెల్లఁ, దిరిగి రాఁ ద్రవ్వి డిగిపోయి యురగభూమి
నాదిపురుషు నవ్విష్ణుని యపరమూర్తిఁ, గనిరి సంవర్తమార్తాండకపిలుఁ గపిలు.

63


వ.

తత్సమీపంబునన యధ్వరహయంబు గాంచి కలుషించి.64
క. అవినీతు లై యెఱుంగక, యవనీశ్వరసుతులు [5]చోరుఁ డశ్వహరుఁడు వీఁ
డవుఁ జంపుఁడు మ్రింగుఁ డనుచుఁ, గవిసి పొదివి రసురలట్ల కఠినస్ఫూర్తిన్.

65


సగరపుత్రులు కపిలు కోపాగ్నిచేత భస్మీభూతు లగుట

వ.

అట్టియవజ్ఞత సైరింపక యమ్మహానుభావుండు.

66


క.

ఎఱమంట లుమియుచూడ్కుల, జుఱచుఱఁ జూచుటయు నపుడ చోద్యంబుగ నం
దఱు దగ్ధదేహులై రూ, పఱి తఱుచుగ భస్మరాసు లయిరి నరేంద్రా.

67
  1. జోళకేరళులం దాదృశులనకా; ధాత్రీశుల.
  2. నొకరికి
  3. యుఁడీ
  4. కాంతి
  5. పాఱు