పుట:హరివంశము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 2.

27


వెలయఁజేయుపుత్రుఁడవు గావలయుఁ జువ్వె
యపుడు సుద్యుమ్నుఁ డను నామ మమరు నీకు.

6


వ.

అట్టి పురుషత్వంబునందుఁ బరమధర్మపరతయు [1]లోకప్రియకారితయు సర్వసమర్చ
నీయతయు [2]నిన్ను నధికయశోవిజృంభితుం గావించు నవ్వైవస్వతమనువుం గాన
నరుగు మని పనిచిన మగిడి చనునప్పు డమ్మార్గంబున.

7


తే.

సోమనందనుఁ డత్యంతసుందరుండు, బుధుఁడు గామించి పొందె నప్పువ్వుఁబోఁడి
నైలుఁ డనఁగఁ బురూరవుం డపుడు జనన, మొందె నమృతాంశువంశకరోదయుండు.

8


క.

ఇల పదపడి సుద్యుమ్నత, వెలిఁగి మహారాజ్యవిభవవిభ్రాజితతో
నిల యేలె ధర్మనీతి, స్థలన మొకింతయును లేక కడుదీర్ఘముగన్.

9


వ.

ఆసుద్యుమ్నునకు నుత్కలుండును వినతాశ్వుండును గయుండును ననువారు
వుట్టి రందు నుత్కలుం డుత్తరవిషయంబునకుఁ బతి యయ్యె వినతాశ్వుండు పశ్చిమ
ధరణీపాలనంబు పరిగ్రహించె గయుండు గయాభూమి యగుపూర్వదిగ్భాగం
బేలె వైవస్వతమనువు మనుజలోకంబున దండనీతి ప్రవర్తించి మార్తాండలోకం
బున కరిగినపిదప నిక్ష్వాకుండు మధ్యమదేశంబు శాసించె నాసుద్యుమ్నుండు
వసిష్ఠానుమతంబునఁ బ్రతిష్ఠానపురంబునం బ్రతిష్ఠితుండై యుండి.

10


క.

తనవనితాదశఁ గాంచిన, తనయునకుఁ బురూరవునకుఁ దత్పురసామ్రా
జ్యనిరూఢి యొసఁగి మోదం, బునఁ దప మొనరింప విపినభూమికిఁ జనియెన్.

11


వ.

ఇక్ష్వాకు వెనుక[3]వారైన మనుపుత్రు లెనమండ్రయందును.

12


సీ.

విను మరిష్యంతికి జనియించెఁ బుత్రశతంబు నాభాగుఁడు తనయు నొకని
నంబరీషుం గాంచె ననఘ ధృష్ణునకు దార్ష్ణికనాములై బహుక్షితిపవరులు
వుట్టిరి శర్యాతి[4]పుత్రుఁ డానర్తుఁ గన్నియ సుకన్యాఖ్యను నెమ్మిఁ గనియె
నయ్యింతి భార్గవచ్యవనుని కాదిలిభార్యయై సద్వృత్తిఁ బరఁగె నందు


తే.

వీరుఁ డానర్తుం డానర్తనిషయమునఁ గు, శస్థలీనామనగరవాసమునఁ గరము
[5]ప్రీతి నుండంగ [6]సూనుఁడు [7]రేవతుఁడనఁ, గలిగి నూర్వురుకొడుకులఁ గలుగఁజేసె.

13


రైవతుఁడు రేవతిని బలరామున కిచ్చిన ప్రకారము

వ.

[8]అందఱకు నగ్రజుం డైన రైవతుండు కకుద్మి యనుపేరు వెలయ విలసిల్లుచు
నాత్మీయకన్యయైన రేవతిం దోడ్కొని తనసుచరితంబున సిద్ధంబైన సిద్ధపదగమనం
బున బ్రహ్మలోకంబునకుం గార్యార్థియై చని.

14
  1. లోకోప
  2. నీతనువు నధికశృంగారంబు, నీతను వధికయశోవిశ్రమంబు
  3. వారగు
  4. పుత్రకుఁ డానర్తుఁ డనువాని సుతనుకన్యాఖ్య నెమ్మి, గనియె నయ్యింతి భార్గవునకు గాదిలి.
  5. తృప్తి
  6. సూనుఁడై ఋషభుఁ డనఁగ; సూనుఁడు రేవుఁ డనఁగ.
  7. సంస్కృతహరివంశమునందు, 'రేవోనామమహాద్యుతిః, ఆనర్తవిషయశ్చాసీ త్పురీచాస్య కుశస్థలీ, రేవస్య రైవతః పుత్రః కకుద్మీ నామ ధార్మికః.’ 1-10-33
  8. అందఱికి; అందున.