పుట:హరివంశము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 1

25


శా.

లక్ష్మీలాభ[1]విధాయినిర్మలగుణాలాపైకధర్మా యశో
లక్ష్మీకల్పితలోకలోలుపవధూలభ్యావలోకా సమ
స్తక్ష్మాభోగఫలాత్మభాగ్యవిలపత్సౌభాగ్యయోగ్యా మహా
సూక్ష్మోపాయహృతాన్యభూపవిభవా శూరత్వశక్రోద్భవా.

197


క.

సకలద్వీపాంతరర, త్నకలాపనిరంతరార్చ[2]నాకలనారం
భకకురుమలూరిపురనా, యకమల్లచమూవరేణ్యహారినిషేవ్యా.

198


మాలిని.

బహుళహయగజేంద్రస్ఫారసేనాసహస్ర
ప్రహతకటకరాష్ట్రభ్రష్టద్విష్టరంప
ద్గ్రహణపరమధన్యోదగ్రధాటీభటశ్రీ
మహితజయవిజృంభా మంజురాజ్యోపలంభా.

199


గద్యము.

ఇది శ్రీశంకరస్వామి సంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
ధుర్య శ్రీసూర్య సుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ నామధేయ
ప్రణీతం బైన శ్రీహరివంశంబునఁ బూర్వభాగంబునఁ బ్రథమాశ్వాసము.

200


  1. విధానధర్మగుణ కళ్యాణైక
  2. నసుకవిజనరం జకముకుళప్రియనాయక