పుట:హరివంశము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

హరివంశము


వ.

శిబి యను మహాభాగుండు వేల్పులం బాలించె. కావ్యుండును బృథుండు
నగ్నియు జహ్నుండును ధాతయుఁ [1]గపివంతుండును బవనుండును ననువారు
సప్తర్షిభావంబులు వడసిరి. జ్యోతియుఁ దపస్యుండును సుతపుండును దపో
మూలుండును దపోధనుండును దపోరతియుఁ దన్వియు నకల్మాషుండును బరం
తపుండును నను మనుతనూజులు పదుగురు రాజు లైరి. పంచమమనువయిన రైవతు
కాలంబునం గలవారల వినిపించెద.

156


తే.

విను సుమేధసు లనఁగ భూతయు లనఁగ, వరుసతోడ వైకుంఠులు స్వామిభోగు
లనఁగ నాలుగుగణములై రమరు లమర, విభుతఁ గాంచెఁ బుణ్యాత్ముండు విభుఁ డనంగ.

157


వ.

వేదబాహుండు వినిద్రుండు వేదశిరుండు హిరణ్యరోముండు రత్ననేత్రుండు
పర్జన్యుం డూర్ధ్వబాహుండు ననువారు సప్తమును లైరి. ధ్రుతిమంతుం డవ్య
యుండు తత్త్వదర్శి [2]నిరుత్సుకుఁ డరణ్యుండు ప్రకాశుండు నిర్మోహుండు [3]సత్య
వాక్కు కృతియు రైవతుఁడు ననుమనుప్రభువులు భూప్రభువు లైరి. చాక్షుసుం
డాఱవు మనువు తత్కాలంబున.

158


తే.

ఆప్యులు [4]ప్రభూతు లన భవ్యు లన భృగువులు, ననఁగ లేఖులు నావేల్పు లైదుగణము
లైరి వేల్బుల వేలె శతాధ్వరక్రీ, యాజిరత్రిలోకుండు మనోజవుండు.

159


వ.

అంగిరసుపుత్రు లేర్వురు మునులై వెలసిరి. మనునందను లైన యూరుప్రభృతు
లుర్వి పాలించిరి. సప్తమంబగు వైవస్వతమన్వంతరం బిప్పుడు వర్తిల్లెడు. నిందు
వసురుద్రాదిత్యమరుద్విశ్వే[5]1సాధ్యాశ్విను లను ననిమిషు లెనిమిది గణంబు.
[6]లూర్జస్వి యనువాఁడు దేవేంద్రుండు. కశ్యపాత్రివిశ్వామిత్రగౌతమభరద్వాజ
జమదగ్నివసిష్ఠులు సప్తమునులు. మనుజాతు లయిన యిక్ష్వాకుప్రముఖులు
మహీ[7]శు లయి నిజవంశంబులు ధరణిం బ్రతిష్ఠించిరి.

160


క.

మనువులు నమరులు నింద్రుఁడు, మునులును నిజవిహితకాలములతుదిఁ దొలఁగం
జనఁగా నన్యులు వెసఁ గై, కొని నిలుతురు తత్పదము లకుంఠిత[8]గరిమన్.

161


వైశంపాయనుఁడు జనమేజయునకు ననాగతమన్వంతరముల జెప్పుట

క.

వీ రెల్లరు దమతమయధి, కారంబులు నిర్వహించి కడపట నాత్మో
త్తారక మగు బోధము గని, చేరుదు రఖిలాత్ము మగుడఁ జెందరు భవమున్.

162


వ.

అతీతవర్తమానమన్వంతరంబు లెఱింగించితి. నిటమీఁద సూర్యసుతుండు సావర్ణుం
డష్టమమనుత్వంబు నొందెడు. నతనికాలంబున సుతపస్సునాభముఖ్యు లన నమ
ర్త్యులు మూఁడుగణంబు లయ్యెదరు. బలిదైత్యుండు దివిజాధిపత్యంబుఁ బడయుఁ.
బరశురాముండు పారాశర్యుండు ఋశ్యశృంగుండు గృపాచార్యుం డశ్వత్థామ

  1. కపిధానుండు; కపీవరుండు
  2. నియుక్తుం
  3. సత్యవంతుండు కపియు
  4. ప్రసూతఋతులనఁ
  5. దేవసాధ్యా
  6. లోజస్వి
  7. పతులయి
  8. గతినిన్