పుట:హరివంశము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ.1.

19


క.

తోయజసంభవు సాక్షా, త్కాయసముద్భవుఁ డు[1]దాత్తదానాధ్యక్షుం
డాయతమతి యాదిమనువు, స్వాయంభువుఁ డపరపద్మసంభవుఁ డనఘా.

150


వ.

అతనికాలంబున [2]యామాభిధానులు పన్నిద్దఱు దేవత లైరి. పరమేష్ఠితేజం బపర
మూర్తియై యింద్రత్వంబు నొందె. మరీచి యత్రి యంగిరసుండు పులస్త్యుండు
పులహుండు క్రతువు వసిష్ఠుండు సప్తమునిపదంబు గైకొనిరి. ప్రియవ్రతోత్తాన
పాదులు మనుపుత్రులు ధాత్రీపరిపాలనంబునకు [3]నభిషేకంబు భజించి. రందుఁ
బ్రియవ్రతునకు నాగ్నీధ్రుం డగ్నిబాహుండు మేధుండు మేధాతిథి వసువు
జ్యోతిష్మంతుఁడు ద్యుతిమంతుండు హవ్యుండు [4]వపుష్మతుండు సవనుండు ననం
బదుండ్రు గొడుకులు గలిగిరి. వారిలో నగ్ని[5]బాహుమేధహవ్యు లనువారు
మువ్వురు విరక్తులయి పోవం దక్కిన యేడ్వురు నేడుదీవులకు నేలికలై వేర్వేఱ
పెక్కండ్రఁ దనయుల నుత్పాదించి వర్షాధిపతులం గావించిరి.

151


క.

స్వారోచిషుఁ డనుపేర ను, దారుండు ద్వితీయమనువు తద్దయు వెలసెన్
దారాజికలుషితు లనం, గా రెండుగణంబు లైరి క్రతుభుజులు నృపా.

152


వ.

[6]విపశ్చిన్నామధేయుండు యజ్ఞశతసుకృతంబున నింద్రుం డయ్యె. [7]నూర్జుండు
ప్రాణుండు దత్తుం డగ్ని ఋషభుండు చ్యవనుండు బృహస్పతి యను వారు సప్త
మునిత్వంబు నంగీకరించిరి. [8]జైత్రుండు గింపురుషుం డాదిగా మనుపుత్రులు రాజ
కులంబులం గలిగించిరి.

153


సీ.

విను ముత్తముండు నా వెలసె మూడవమను వతనికాలంబున నమరగణము
లైరి సుధామసత్యశివప్రతర్పణవశవర్తు లన నొప్పి వాసవత్వ
మొందెను శాంతి నా నొకపుణ్యకృత్తు సుతేజుఁడు మొదలై దీప్తతేజు
లనఘు లేడ్వురు వసిష్ఠాత్మజన్ములు మునులై రోలి నిషుఁ డూర్జుఁ డనఁగ వత్సు


తే.

డనఁగ మధుమాధవులు నాఁగ [9]నవల సహుఁడు
[10]శుచి యనఁగ శుక్రుఁ డన నభస్యుఁడు నభుఁ డన
మనుతనూభవదశకంబు మహి [11]భరించెఁ
దత్తదన్వయములుఁ బెక్కు దనరె నందు.

154


తే.

తామసుఁడునాఁ [12]జశుదుఁ డతామపాత్ముఁ, డధికుఁడై యొప్పె మనువుదదంతరమున
దేవతలు [13]హారసత్యసుధీసుధాదు, లనఁగ నాలుగు గణములై యమరి రోలి.

154
  1. ధాత కాలా
  2. యమా
  3. నభిషిక్తులై
  4. సంస్కృతగ్రంథములో “నవుష్మంతుఁదు” లేదు. పుత్రుండు ఉన్నది. వ్రాతప్రతిలో “హవ్యుండు” లేదు. పుత్రుండు ఉన్నది.
  5. బాహుమేధనత్రు
  6. మహిక్షి
  7. నూస్తంబుఁడు
  8. హరిద్రుండు
  9. నట శుచి యన
  10. శుక్రు డన సహుఁ డన నభస్యుఁడు, సుహుఁ డనఁగ.
  11. ధరించె
  12. జతుర్ధుఁడు నామహాత్ముఁ
  13. హారిసత్య