పుట:హరివంశము.pdf/570

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

522

హరివంశము

క. మీ రడ్డము సెప్పక యీ, గారవము మదీప్సితంబుగా సిద్ధింపం
     గోరుఁ డని పలికి వామనుఁ, జేరంగాఁ బిలిచి [1]చేయి చేకొని వినతిన్.260
క. అయ్యా నీయడిగినయది, యెయ్యెదియైన నగుఁగాక యిచ్చెద నిటుర
     మ్మియ్యెడఁ గూర్చుండు మనుచు, నయ్యుత్తమగుణు నుదఙ్ముఖాసీనునిగన్. 261
వ. ఉనిచి యతని యభ్యర్థితం బయిన యర్థంబు సువ్యక్తంబుగా నుగ్గడించి.262
[2]మ. కమనీయోజ్జ్వలహేమరత్నరచనాకల్యాణమై యొప్పు కుం
     భమునం బుణ్యజలంబు వుచ్చుకొని యీభవ్క్షితిత్యాగయో
     గమునం బ్రీతుఁడ గాత విష్ణుఁడు ద్రిలోకస్వామి యుంచుం బ్రహ
     ర్షము నిండారఁగ నించె ధార యతఁ డాసర్వాత్ముహస్తంబునన్.263
క. వైరోచనకరవితరణ, ధారాసలిలంబు నిశ్చితంబుగఁ దనచే
     యారం దొరుఁగందడవ య, వారణమెయి వామనుం డవామనుఁ డయ్యెన్.264
వ. ఇట్లు విజృంభించి యద్దేవుండు సర్వదేవతామయం బైన యాత్మీయదివ్యరూపం
     బుద్దీపితంబు సేసిన నమ్మహామూర్తికి భూలోకంబు చరణంబులు నూర్ధ్వలోకంబులు
     శిరంబును నయ్యెం జంద్రాదిత్యులు లోచనంబులఁ బిశాచంబులు పాదాంగు
     ళుల గుహ్యకులు హస్తాంగుళుల విశ్వులు జానువుల సాధ్యులు జంఘల యక్షులు
     నఖంబుల నచ్చరలు రేఖల సూర్యాంశువులు కేశంబులం దారలు రోమమూలం
     బుల మహర్షులు రోమాగ్రంబుల దిక్కులు బాహువుల నశ్వినులు శ్రవణంబులఁ
     బవనుండు ఘోణంబున గరుండు మనంబున సరస్వతి జిహ్వ స్వర్గద్వారంబు
     నాభిని మిత్రత్వష్టలు బొమలను బ్రజాపతి పుంస్త్వంబున నసువులు వీఁపున
     రుద్రుండు హృదయంబున బ్రహ్మ యూరువుల వేదంబులు దంతంబుల సముద్రం
     బులు ధైర్యంబున లక్ష్మీమేథాధృతివిద్యలు కటిప్రదేశంబునఁ బరమపదంబు లలా
     టంబున నింద్రుండు స్రోతస్సులఁ దపోదమవ్రతంబులుఁ దేజంబునఁ గ్రతు
     పూర్తంబు లోష్ఠకక్షవక్షంబుల వసియింప నమ్మహాతేజుం డొప్పెఁ దత్తేజంబు
     సహస్రసూర్యోదయచంద్రశతం బని నిశ్చయింప రాదు గావున నప్రమేయం
     బట్టియతర్కితప్రాదుర్భావంబున.265
మ. బలి యాశ్చర్యము నొంది సంభ్రమభయభ్రాంతత్వసమ్మేళనా
     కులభావంబునఁ జూచుచుండె నసురల్ క్రోధోద్ధతిన్ వేలసం

  1. చేయఁ జే గొని
  2. శా. స్ఫీతానేకవినూత్నరత్నరచనం జెన్నొందుకుంభంబునం
         బూతంబైనజలంబు పుచ్చికొని యీభూదానసంపత్తిచేఁ
         బ్రీతుండై హరి గాచు మమ్ము ననుచుం బెంపార దద్ధార యా
         దైతేయోత్తముఁ డమ్మహాపురుషుచేతం బోసె నుల్లాసియై.