పుట:హరివంశము.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. ౧.

5


క.

రామునకు లక్ష్మణుఁడు సు, త్రామసుతుఁడు ధర్మజునకుఁ దగసౌభ్రాత్రం
బేమెయి నెఱపుదు రామెయి, వేముప్రభుఁ గొల్చె మల్లవిభుఁడును భక్తిన్.

29


శా.

వేమ[1]క్ష్మాధిపు కూర్మిపుత్రుఁడు దయావిభ్రాజి యవ్యాజతే
జోమార్తాండుఁడు కీర్తనీయసుగుణస్తోమంబులం దేమియున్
రామస్ఫూర్తి[2]కి లొచ్చుగాక సరియై రాజిల్లు [3]రాజార్చితుం
డాముష్యాయణుఁ డెందుఁ బోతయచమూపాగ్రేసరు డిమ్మహిన్.

30


వ.

తదీయానుజుండు.

31


క.

దానంబునఁ గర్ణునిసరి, మానంబున పేర్మి ననుపమానుఁడు బుధస
న్మానచతురుండు ప్రోలయ, సూనుఁడు గోమటి [4]సమస్తసులభుఁడు కరుణన్.

32


వ.

వేమధాత్రీపతికిఁ బరమమిత్రుఁడును సకలజగజ్జైత్రుండునునగు మాతుల
ప్రియపుత్రుండు.

33


మ.

జయ మేకయ్యమునందు నెంత రిపుక్ష్మానాథులం జెందనీఁ
డయసంపన్నత నెన్నఁగున్ వెలితిగాఁ డాద్యక్రమాయత్తమై
నయ మాత్మీయముగాఁ జిరస్థితుల నానంగించు నాఢ్యుండు చి
ట్టయనూకప్రభుఁ డిద్ధసత్యగుణని[5]ష్ఠం బట్టి పుణ్యం డిలన్.

34


వ.

ఇట్లు [6]సకలసమృద్ధులఁ బ్రసిద్ధప్రభావుం డైన వేమజననాథుం డొక్కనాఁడు
ప్రమోదంబు మిగులం బేరోలగం బుండి.

35


క.

అంబుజభవనిభుఁడును బో, లాంబావిభుఁడు నగు సూరనార్యునిసుతు న
న్నుం బూజితధూర్జటిచర, ణాంబుజు శ్రీవత్సగోత్రు నంచితచరితున్.

36


వ.

సవినయంబుగాఁ బూజించి యిట్లనియె.

37


తే.

సకలభాపాకవిత్వవిశారదుఁడవు, సాధుసమ్మతుఁడవు నిత్యసౌమ్యమతిని
భవ్యుఁడవు గాన నీమీఁదఁ [7]బరగఁ బక్ష, మేను గలిగియుండుదు నెప్పు డెఱ్ఱనార్య.

38


శా.

నాతమ్ముండు ఘనుం[8]డు మల్లరధినీనాథుండు ని న్నాతత
[9]శ్రీతోడన్ సముపేతుఁ జేసి యెలమిం జేపట్టి మా కిచ్చుటం
జేతోమోద మెలర్ప రామకథ మున్ జెప్పించి యత్యుత్తమ
ఖ్యాతిం బొందితి నింక నేను దనియన్ గావ్యామృతాస్వాదనన్.

39


క.

భారతపరాంశ మని యిం, పారఁగఁ జెప్పుదురు బుధులు హరివంశము నీ
వారమ్యకథఁ దెనుంగుగ, ధీరోత్తమ నిర్వహించి తెలుపుము మాకున్.

40


వ.

అనినం బ్రహర్షితపులకితదేహుండ నై యమ్మహాభాగునిసమగ్రసంప్రార్థనంబుఁ
గృతార్థతాకలిత[10]వృత్తం బగుచిత్తంబునం గైకొని యిట్లంటి.

41
  1. క్ష్మావిభు
  2. ని బోలుగాక
  3. రాజిల్లె
  4. సమగ్రసులభుఁడు
  5. ష్ఠాపుణ్యగ; ష్ఠాగణ్యపు
  6. సర్వసిద్ధుల
  7. బరఁగు పక్ష
  8. డగుచున్న
  9. స్ఫీతశ్రీ
  10. నృత్త