పుట:హరివంశము.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

463

     నాశ్చర్యముగ నోలి ననఘ కీర్తించితి నాశ్చర్య మంభోరుహాక్షునంద
     కాక యొండెడ మఱి గల్గునే యవ్విభుజన్మంబు లాశ్చర్యసంశ్రయములు
తే. కర్మములు మహాశ్చర్యముల్ నిర్మలంపు
     గుణము లాశ్చర్యపరసీమ లణువునకును
     [1]నణువును మహత్తునకును దా నతిమహత్తు
     నాత్మ నారాయణుఁడు సత్పరాయణుండు.322
క. దైత్యులయందును మఱి యా, దిత్యవరులయందు నఖిలదివ్యులయందున్
     నిత్యుఁడు ముకుందుఁ గడవఁగ, నత్యధికుం డైన ధన్యుఁ డన్యుఁడు గలఁడే.324
క. వసురుద్రాదిత్యాశ్వి, శ్వసనులు దిగ్గగనములును సలిలాగ్నులు ధ
     ర్మసమాధితపోదమశాం, తిసత్వయజ్ఞములు వాసుదేవునిమూర్తుల్.325
క. ధాతయు సంహర్తయును వి, ధాతయు నచ్యుతుఁడ హరిపితామహమూర్తి
     స్ఫితుఁడు పీతాంబరుఁడ మ, హాతత్త్వము విష్ణుఁ డొకఁడ యను నాగమముల్.326
క. దేవదనుజమనుజాదిక, జీవచయంబులకు నెల్ల శ్రీవిభవములుం
     గైవల్యము నొసఁగెడు పర, దేవత మఱి గలఁడె విష్ణుదేవుఁడు దక్కన్.327
క. నీ విదియంతయు సమ్య, గ్భావంబున నెఱిఁగి విష్ణుపదకమలధ్యా
     నావేశమునఁ గృతార్థపు, జీవనుఁడవు గమ్ము నృపతిశేఖర భక్తిన్.328
తే. అనఘ యీబాణ యుద్ధకథానుబద్ధ, మైనపుండరీకాక్షుమాహాత్మ్య మర్థి
     వినినఁ జదివినఁ దలఁచినఁ దనకులప్ర, తిష్ఠయును శ్రీయు ధర్మబుద్ధియునుఁ గలుగు.329
వ. అని యుపన్యసించి యమ్మునీంద్రుం డన్నరేం ద్రు నుపలక్షించి.330
సీ. నీమహాయజ్ఞంబు నిర్వర్తితంబుగాఁ దత్పరమతి భారతప్రసంగ
     మున విష్ణువంశంబు మొదలింటినుండియు నెలమిఁ గీర్తించితి నిద్ధపుణ్య!
     యెవ్వఁ డీయాఖ్యాన మెప్పుడు పఠియించు వినయంబుతో విను విని మనమున
     మఱవక యునుచు నమ్మనుజుఁడు నిర్ముక్తకలుషుఁడై విష్ణులోకంబు నొందు
తే. నిచ్చలును రేప మేల్కని నియతి నిందు, గొంతకథ యేది యేనియుఁ గోరి జపము
     సేయుసుకృతాత్మునకు నఱచేతిలోని, వైహికాముష్మికప్రితు లఖిలములును.331
మ. హరివంశశ్రవణానుకీర్తనల బ్రహ్మక్షత్రవిట్ఛూద్రు లా
     దరణీయశ్రుతిలక్ష్మియున్ విజయనిత్యశ్రీయు భవ్యార్థలా
     భరమావర్గము సర్వసౌఖ్యరుచులం బ్రాపింతు రారోగ్యమున్
     బరమాయుస్సుతకీర్తులున్ సమత యొప్పం జెందు నిత్యంబుగాన్.332
క. అని వైశంపాయనముని, వినుతవ్యాఖ్యాన [2]మెల్ల వివరించిన న
     జ్జనమేజయజననాథుఁడు, మనమున సమ్మోదసుఖసమగ్రత నొందెన్.333

  1. ప్రణువునకును, నణువును మహత్వములకును నతిమహత్త, రాత్మ...
  2. సంప్రవీణత ప్రకటిం, చిన జనమేజయజనపతి, యనుపమ ......