పుట:హరివంశము.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

444

హరివంశము

     దివంబున నిలిచి రట్టి తలపాటున దవ్వుదవ్వుల శర్వుండు శౌరిమిఁద శరశతకం
     బేయుటయు నారాయణుం డైంద్రాస్త్రంబు ప్రయోగించిన.141
క. [1]ఆయస్త్రమువలన మహా, సాయకములు శతసహస్రసంఖ్యంబులు వే
     వే యుప్పతిల్లి పొదివెన్, ద్రైయంబక మగురథం బుదగ్రస్ఫూర్తిన్.142
చ. [2]అలిగి పురాంతకుండు దహనాంబక మేసిన నెల్ల దిక్కులు
     న్వెలుఁగఁ గృణానుకీలములు విష్ణుశరావలి మ్రింగి యాతనిం
     బలునిఁ బ్రసూనసాయకునిఁ బక్షివరేణ్యునిఁ జుట్టుముట్టినం
     బొలిసిరి వైరులం చసురపుంగవు లార్చిరి పేర్చి యుబ్బుచున్.143
క. మురరిపుఁడు గినుక వారుణ, శరము ప్రయోగింపఁదడవ శాంతం బయ్యెన్
     హరుబాణము బాణాసురు, పరివారంబునకు విన్నఁబాటు దలిర్పన్.144
వ. భర్గుండు మఱియును బైశాచరాక్షసరౌద్రరాక్షసాంగిరసంబు లను నస్త్రంబులు
     గ్రమప్రయు క్తంబులు గావింప గోవిందుండును వాయన్యసావిత్రసమ్మోహన
     సంజ్ఞంబు లగు మార్గణంబులవలన వరుసన నాలుగిట నద టణంచి వైష్ణవాస్త్రం
     బభిమంత్రితంబు సేసి యేసిన.145
తే. తలఁకి సురసిద్ధసాధ్యగంధర్వు లాది, గాఁగ దివి నుండ నోపక కలఁగఁబడిరి
     బాణబలములుఁ గ్రమ్మఱ భయము నొంది, చెదరెఁ గనుకని భూతంబు లదరె నాత్మ.146
వ. అమ్మహాస్త్రంబు చనుదెంచు రౌద్రంబునకు రుద్రుండును బ్రతీకారం బెఱుంగక
     యొక్కింత విచారవివశుం డయ్యె నాలోన నాభీలజ్వాలాకరాళం బై యది
     యద్దేవుతేరు సరథ్యసారథికంబుగా గాఁ బొదివి ప్రజ్వరిల్లె నంత నంతయు నెఱింగి
     యతిత్వరితంబుగ బాణుండు సమరంబునకు నిశ్చయించి బ్రాహ్మణోత్తములకు
     నమస్కరించి వారు గావించు శుభస్వస్త్యయనంబులును సిద్ధమంత్రౌషధిసంభా
     వనంబులుం గని యుద్దీపితుం డై గోభూహిరణ్యదానంబు లనేకంబు లొనర్చి
     దివ్యం బగు రథం బెక్కి మహారథులు పరివేష్టింప నరిగి మహాదేవస్యందనంబు
     చేరువ నిలిచె నట్టి సమయంబున.147
ఉ. వైష్ణవబాణపావకనివారణభంగికి నొండుమై నలం
     భూష్ణుత సంభవింపమిఁ బ్రభుండు పురత్రయదాహధుర్యతా
     [3]ధృష్ణువనంగఁ బేర్చినప్రదీప్తతరాంబకమున్ యుగాంతకా
     లోష్ణకరాభముం బటుబలోద్దతిఁ గైకొని క్రోధచండుఁ డై.148
వ. కార్ముకంబున సంధింప నుద్యుక్తుం డగుటయు నెఱిఁగి వాసుదేవుం డమ్మహాదేవు
     నయ్యుద్యోగంబువలనం బాపుటకు వెరవు గనుంగొని.149

  1. క. ఆయస్త్రమువలన ననే, కాయుతమస్తములు పుట్టి కాల్వఁగఁ దొఁడగన్
         కాయజదహనుఁడు ప్రతిశర, మేయఁగ శాంతమునఁ బొందె నింద్రుని శరమున్.
  2. బలుపగు శంకరుండు వడి బంధురలీల నమర్చె వారికిన్, వెలుఁగుచు, బావకాస్త్రమును
  3. ధిష్ణు