పుట:హరివంశము.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

426

హరివంశము

తే. వీనిచేత దూషిత యైన వినుతవృత్త, సీమ వెలయు దీఖలు నిట్లు సేయకున్న
     ననుడు నాతఁడు దేవర యానతిచ్చి, నట్ల యగు నైన నొకవాక్య మవధరింపు.254
సీ. గాంధర్వవిధిఁ గోరి కన్నియ పెండిలి యైనవాఁ డితఁడు కార్యంబు గడచె
     నితని నొండొకటి సేయించిన బాల నుక్కటశోకవహ్నిఁ ద్రోచుటయె కాదె
     యెందుండి వచ్చెనో యెవ్వఁడో యవ్వీరు నెఱుఁగుటయును లెస్స యెల్లభంగిఁ
     బ్రకృతిమానవుఁడు గాఁ డకలంకరూపవిక్రమముల నమరులకంటె మేటి
తే. [1]శీలవృత్తవయోబలశ్రీసమగ్ర, సౌందర్యగుణముల మే లనంగఁ
     దగినవాఁ డిమ్మహాత్తుఁ డీధరణీలోన, మాన్యుఁ డగు నెంచి చూడఁగ ధన్యుఁ డధిప.255
మ. ఇరుగేలం గలయం గదోద్యతములై యేపారునివ్వీరుతో
     దుర మేబంగి నొనర్తు నాక సరి నీతో రాసి నానాస్త్రని
     ర్భరపీడం బడియుండియుం దనదుభ్రూభంగంబునం జూడ్కి క్రో
     ధరసోగ్రంబుగ నీదెసం బఱపెడుం దైత్యేంద్ర లక్షించితే.256
ఉ. ఆతనియున్న రూ పరసితయ్య! యవశ్యము నీకుఁ దుల్యజా
     మాత యనంగ నీ దుహితమాన్యత కర్హుఁ డనంగ నిన్ను సం
     ప్రీతునిఁ జేయఁ జాలెడుగభీరగుణుం డన నుల్లసిల్లెడున్
     నాతలఁ పిచ్చగింపు మనినం బ్రభుఁ డించుక యియ్యకోలునన్.257
వ. అక్కుమారునకుఁ దగిన కావలి పెట్టి నిజభవనంబునకుం బోయె నంత.258
క. చనుదెంచి నారదుం డా, తని నాశ్వాసించి కంసదమనుని నేఁ దో
     డ్కొనివచ్చెద నీదుర్దశ, యనుచీకటి నుగ్రభానుఁ డడఁచునటులుగాన్.259
వ. ధీరజనసత్కార్యం బగు ధైర్యంబు కలిమి యిట్టిచోట్లకుం గాదె కావున నీపరిపీడ
     నంబు సైరించుట లెస్స యని చెప్పి యతఁ డరిగినఁ దన యున్న తెఱంగు సూచి
     యశ్రువిలులితిలోచన యైన వల్లభతో ననిరుద్ధుండు.260
చ, ఎదురెదురై పెనంగుటకు నేమియు నోర్వక మాయ వన్ని యీ
     త్రిదశవిధి చేసినయుదీర్ణవికార మవశ్యభావి యై
     కదిరెఁ గడింది యై పరఁగుకాలము గెల్వ వశంబె యైన నా
     పద దొలఁగింపఁగాఁ బరమబంధుఁడు శౌరి గలండు [2]మానినీ.261
వ. లయకాలోత్థపతంగబింబముక్రియన్ లాయున్ యదీయోగ్రని
     ర్దయనిర్ముద్రసుదర్శనాఖ్యపటుచక్రం బిద్ధదైతేయసం
     క్షయసంక్రీడకు నట్టదేవుఁడు కృపాకళ్యాణుఁ డబ్జాక్షుఁ డ
     క్షయుఁ డాత్మీయపరాభవం బెటులు నిచ్చన్ సైపఁగా నేర్చునే.262

  1. సకలవేదశాస్త్రముల విశారదుండు, గావలయు (మరి) పడుగును గాఁగవలయు
    శీలవృత్తయశంబుల మేలనంగఁ, దగినవాఁడు గావలయు నీధన్యుఁ డధిప.
  2. కామినీ