పుట:హరివంశము.pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

423

క. అంతంతఁ బగతురం గని, సంతసమున నొక్కయసియుఁ జర్మముఁ గొని దు
     ర్దాంతగతి నడచెఁ దా మిసి, మింతుఁడు గా కతఁడు ప్రియకు మెచ్చు దలిర్పన్.225
క. దీపహుతాశనుఁ బొదివెడు, దృప్తశలభతతులుఁ బోలె దితిజబలము ల
     ప్రాప్తపరిభవుని నాహరి, [1]నప్తఁ బొదివి రంత నుల్బణక్రౌర్యమునన్.226
తే. తరతరంబ విద్వేషులు దారుణాస్త్ర, శస్త్రచయములఁ బొడువఁ దుషారపిహితుఁ
     డైనరవిమాడ్కిఁ గొంతసే పాతఁ డపుడు, రూఢి ననిరుద్ధుఁ డయ్యు నిరుద్ధుఁ డయ్యె.
చ. అనువున నద్భుతంబు లగునాక్రమణంబుల వానినెల్ల నొ
     డ్డనమున నాఁగియాఁగి సుదృఢం బగుఖడ్గము చేతఁ గొన్నితు
     త్తునియలు చేయుచుం గినిసి దుర్దమతీవ్రచపేటమై కడం
     గిన హరిలీలఁ గూల్పఁ గడఁగెం గరిసన్నిభ దైత్యపఙ్క్తులన్.228
క. అనిరుద్ధుఁ డొక్కరుం డ, య్యనిమిషరిపు లపరిమితసహస్రము లట్ల
     య్యును [2]డయ్యనిమగఁటిమి నతఁ, డని కందఱ కన్నిరూపు లై దీపించెన్.229
క. కరికోటికి బిమ్మటి యై, హరిసమితికి గ్రుడ్లకొలఁది యై రథతతికిన్
     సరిదన్ని తాపలయి త, త్కరవాలకరాళఘాతకఠినత పేర్చెన్.230
సీ. తోరంపుటెమ్ములతోడ నుగ్గడు వగుదందడి ఖరఖరత్కారములును
     గండకొవ్వులయంగకంబులు సెక్క నుగ్రము లగుచటచటాత్కారములును
     శస్త్రభూషణసముచ్చయములు నుఱుపంగఁ గడలొత్తువలుదక్రేంకారములును
     నాపాదమస్తకాహతి వ్రయ్యం దాఁకంగఁ దళుకొత్తుపటపటాత్కారములును
తే. నెల్లదెసలును దార యై యెసకమెసఁగ, మెఱుఁగు లంబరాంతరమున మిక్కుటముగఁ
     గ్రాలు ప్రద్యుమ్నుసుతుచేతివాలు దనరఁ, జూచె నారదముని కుంచె వీచివీచి.231
క. వరుణునితో నంతకుతో, సురపతితోఁ దొల్లి తొడరి చూడమె యిమ్మై
     బరుసఁదన మందు లే దిది, యరు దని వెఱఁగొంది రాత్మ నసురప్రవరుల్.232
వ. అట్టి ఘోరసంప్రహారంబునం దలలు దగియును గాలు గేలు దునిసియు మేను లవి
     సియు దంతజిహ్వాప్రముఖంబులు మురిసియు రూపు చెడి కొందఱు మడిసియు
     నెత్తురులు దొరఁగి కండ లురిలి కసులు దిరిగి కొందఱు బ్రమసియు వెండ్రుకలు
     వీడ వలువలు సడలఁ గైదువు లెడలఁ గంపితకంటకితగర్హితంబు లగు గాత్రంబు
     లతో నాక్రోశస్వరవిహ్వలు లగుచుఁ గాందిశీకు లై కొందఱు దొలంగం గలంగి
     తొల్లి ధీరు లనం బెంపారినవారును సైరణ విడిచి యెడసేసి సందడి నొండొరులం
     ద్రొక్కుచు నుక్కు దక్కి మరలు దొరలును దురంగమాతంగశతాంగంబులతో
     భంగంబుల కోర్చి సైన్యంబులం బురికొల్పనేరక భయంబునం దిరిగి సురిఁగి
     పోవం గుమారుం డుబ్బి [3]బొబ్బవొడిచి యార్చి యర్చిష్మంతుండు గ్రీష్మసమయ
     తీవ్రుం డై వెలుంగుపగిది. గయ్యంపునేల యను నింగిం గైకొని వెలింగె నట్లు
     విఱిగి పఱతెంచిన తనవారిం జూచి విశ్వాససంచలప్రాణుం డై బాణుండు.233

  1. నప్తృ
  2. నొయ్యని
  3. బొబ్బయిడి