పుట:హరివంశము.pdf/469

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

421

     నెమ్మి నొండొరులకు నెచ్చెలికతమున నబ్బినయసమభాగ్యాతిశయముఁ
     గ్రియల నొండొరులకుఁ గీల్కొన నొదవినయౌవనోచితకళావ్యాప్తివిధముఁ
తే. జెన్ను మిగుల నొండొరులకుఁ జెప్పికొనుచు, నద్భుతంబులు భయములు నాదరములుఁ
     గౌతుకంబులు బొడలాడఁగాఁ బ్రియుండుఁ, బ్రియయుఁ గ్రోలిరి నూతనప్రేమరసము.204
క. వితతపరిరంభణంబులుఁ, జతురవచోరుచులు [1]నపుడు సస్మితములుగా
     నితరేతరరతి వారికిఁ గతిపయదినములనె నెఱసెఁ గఱదతనంబుల్‌.205
వ. అంత నయ్యిద్దఱసమాగమంబు నెఱింగి కన్య్యాంతఃపురంబు కావలివారు దైత్య
     వల్లభుపాలికిం జని యవ్విధంబు విన్నవించినం గోపించి.206
శా. నావిక్రాంతియుఁ బేరుఁ బెంపు మదిలోనం గాన కున్మార్గుఁ డై
     నావీ డక్కట సొచ్చి నాప్రియనుత న్వంశైకభూషామణిన్
     భావం [2]బేదఁగ నొక్కమర్త్యుఁ డఁట దర్పం బేర్పడన్ దూషితం
     గావించెన్ మది సైఁపఁగా వశమె యిక్కాలుష్య మెబ్భంగులన్‌.207
క. అరుగుఁడు పొదువుఁడు పట్టుఁడు, పొరిగొనుఁ డాదుర్వినీతుఁ బోనీకుఁడు మ
     త్పరిభవకారికి నజరా, మరదేహున కైనఁ గలదె మనుగడ యెట్లున్.208
వ. అని యనేకసహస్రసంఖ్యలం గలకింకరులం బనిచిన నయ్యసుర లసిశరాసన
     ప్రాసపట్టిసప్రముఖప్రహారణపాణు లై బాణజామాత యున్న యున్నతసౌధంబు
     చుట్టుపొదివి బిట్టదల్చి యార్చిన.209
క. ఉషకౌఁగిట [3]నలరుచుఁ దా, నుషస్సు నిశి యని యెఱుంగ కుద్దామరసో
     న్మిషితుఁ డయి రేయుఁ బవలును, సుషమలుగాఁ గ్రాలు రాజసూనుఁడు నెమ్మిన్‌.210
వ. అమ్మహాకలకలం బాకర్ణించి తనకు నెగ్గుసేయ డగ్గఱుదానవులకట్టలుకగా నెఱింగి
     కట్టాయితం బై సౌధగిరిగహ్వరంబు వెలువడి సింహసమరేఖం బొలుపారి
     దారుణంబుగా నిల్చె నట్టయెడ.211
సీ. కన్నియలకుఁ జేయఁ గానిచేఁతకుఁ జొచ్చి కులనాశ మొనరించి కులట నైతిఁ
     ద్రైలోక్యనాథుండు తండ్రికిఁ బెడఁబాసి చెడితి నిం కెయ్యది చేయుదాన
     నటమీఁద నాకుఁగా నాఱడి వెలవెట్టరాని రత్నముఁబోని రాచపట్టి
     యవధివోయెడి జగదంబ యిచ్చినవరంబునకును నొకహాని వుట్టునొక్కొ
తే. భాగ్యదేవతలార యీబారి గడవఁ బెట్టరే యంచుఁ జేతులు పిసికికొనుచుఁ
     గన్నునీరు నించుచు నార్తకంఠి యైన, యాత్మవల్లభఁ గనుఁగొని యల్ల నగుచు.212
వ. అక్కుమారవరుండు.213
క. నాలావుకొలఁది యెఱుఁగవు, బాలా తలఁకెదవు బాణపరివార మొకం
     డేలా యేను జయింతును, ఫాలాక్షుఁడు బ్రమథవరులుఁ బన్నిరయేనిన్.214

  1. నమరసస్థిరరాగా, యతరతివిధులను
  2. బొందఁగ
  3. ను విహాయను, లుషస్సు లివి