Jump to content

పుట:హరివంశము.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

హరివంశము

చిత్రరేఖ యుషాకన్యకు ననిరుద్ధుని కులశీలవయోబలాదు లెఱిఁగించుట

శా. త్రైలోక్యంబును నేలు దేవుఁడు ధరన్ ధర్మంబు నిల్ప న్నరుం
     డై లీలన్ యదురాజవంశమున విఖ్యాతంబుగాఁ బున్ట్టి గో
     పాలీకేళికరుండు నాఁ బరఁగె నేభవ్యాత్ముఁ డాశౌరికి
     బాలా మన్మఁడు వీఁడు తత్సముఁడు సౌభాగ్యానుభావంబులన్.154
మ. కినుకం దొల్లి యనంగుఁ జేసి పిదనం క్రీడాయతానుగ్రహం
     బున భూతేశుఁడు కృష్ణనందనునిగాఁ బుట్టించినం బుట్టి పెం
     పునఁ బ్రద్యుమ్నుఁ డనఁగ నొప్పెడుమహాభోగాఢ్యుపుత్రుండు త
     న్ననిరుద్ధుం డని పేర్కొనం బరఁగు నత్యాశ్చర్యశౌర్యుం డనిన్.155
సీ. పేర్చి శైలంబులు పెఱికి శైలంబుపై నూడుకొనంగ నొండొంటి వైవఁ
     గడఁగి యంభోధులు గలఁచి యంభోధులపైఁ గ్రందుకొన నూర్మి పటలిఁగలఁప
     గిట్టి దిగ్గజములఁ బట్టి దిగ్గజములతో రాయిడిగను దాఁ బోరొనర్ప
     [1]బ్రహాండపఙ్క్తులు బ్రహ్మాండపఙ్క్తులతోడుత నొండొంటిఁ ద్రుంగ నడువఁ
తే. జాలుఁ గినిసినఁ దక్కినసత్త్వధనుల, తరముగా నెన్నరాదు దుర్ధరభుజుండు
     లలితశృంగారనిధి కళాకలికభువన, గీతకులకేతు వీ ఋశ్యకేతు వబల.156
తే. అఖిలలోకంబులకుఁ దల్లి యైనవిశ్వ, గురునియిల్లాలు చేసినకరుణపేర్మి
     యింత యొప్పునె నీసరి యెవ్వ రింతు, [2]లింతి యొప్పితి పతిఁ బొంద నింతవాని.157
క. సాధించి సురల నేలిన, యాధిక్యము వెలసెఁ దండ్రి కతివా నీచే
     నీధన్యత గొనియాడఁగ, వేధయు జడముఖుఁడు వేయివిధముల నరయన్.158
వ. బాణనిలయం బగుశోణితపురం బెట్లు నిత్యగుప్తం బై యుండు నట్ల కృష్ణనివాసం
     బైన ద్వారకాపురంబును యదువీరసంరక్షణంబున నెవ్వరికి నదృష్టనివేశం బయి
     యుండు నట్లున్నను బ్రద్యుమ్నుతనయుం గదియుదనికి సర్వోపాయంబుల నుత్స
     హించి నీకుఁ బ్రియంబుసేసెద ననిన నసురరాజతనయ యమ్మంత్రితనయ కి ట్లనియె.159
క. యోగినివి కామరూపవు, ధీగణ్యవు ఖేచరత్వదీపితవు మహా
     భాగవు భామిని నీయు, ద్యోగమున కసాధ్యభంగి యొకటియుఁ గలదే.160
ఉ. పున్నమచందురుం జెనయు పొల్పున నయ్యనిరుద్ధుమోము నా
     కన్నులతృష్ణ కిప్పు డిటు గల్గినఁ బ్రాణము నిల్పు నట్లుగా
     కున్నఁ గృతాంతదండహతి నొందుటకుం దగ వైనకాల మా
     సన్నము సన్నుతాంగి యవసన్నత మాన్పఁగఁ జేయవే కృపన్.161
తే. ఏడుదివసంబు లోర్చితి నింక గడియ, దడవునకు నైన లేదు నాతాల్మి చెలియ
     నన్ను బ్రతికించుటయ నీదునైపుణముల, కెల్లఁ దలకట్టు చెలిప్రాణ మెత్తుటసదె.162
క. కుల మొల్లరు నింద యొకటి, దలఁపరు కామార్త లైనతరుణులు మాన

  1. తొడరి బ్రహ్మాండపంక్తులతోడ బ్రహ్మాండపంక్తులు వడి బిట్టు వగుల నడువ.
  2. లింతి యిప్పతిఁ జెందుమీ యింతవాని