పుట:హరివంశము.pdf/454

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

హరివంశము

     ననఁ గాఱుమొగులునఁ దనరుక్రొమ్మెఱుఁ గింతియై నిల్చెనన నెందు నసమలీలఁ
     బొలుపొందుకుంభాండపుత్రి విచిత్రవిద్యాఖని యగుచిత్రరేఖ దనకు
తే. ననుఁగునెచ్చెలిగాఁ దండ్రిపనుపువలన, శాంభవీదత్తవరలబ్ధజనన గాన
     సదృశవరుఁ గోరి యాజగజ్జననిఁజారు, నియతిఁ గొలుచుచునుండె నెంతయును వేడ్క.56
వ. ఇ ట్లుండ ననతిచిరం బగుకాలంబున.57
మ. చిగురుం గెంజడ లొప్పఁ బుష్పరజము ల్సెల్వారు నున్బూదిపూఁ
     తగ [1]లేఁదేటులచుట్టుకోలు జపసూత్రశ్రీలుగాఁ గోకిల
     ప్రగుణాత్తాధ్యయనంబుతోడ సకలారామంబులున్ శాంభవం
     బగుదీక్షావిధి నొంద నా వెలసెఁ జైత్రారూఢి విశ్వంబునన్.58
వ. ఆసమయంబున బాణనగరనివాసుం డై యున్నకుసుమబాణదమనుండు కుసుమ
     గోమల యగుహైమవతిం గుసుమసమయసముచితం బగువిహారంబుల నలరించు
     తలంపున ననేకాప్సరోరమణుల రావించి గంధర్వసుదతులనెల్లం గూడఁ బిలిపించి
     వారివారిని సంగీతప్రసంగకలనంబులకుం గట్టాయితం బై రండని దేవియనుజ్ఞం
     జిత్రరేఖాదిలీలావతులఁ బార్వతీరూపంబునఁ దన్నుఁ గదిసి కొలువ నియమించి
     సర్వప్రమథులఁ దమతమశక్తులతోడ శివశక్తిరూపధరు లై వచ్చునట్లుగా నాజ్ఞా
     పనం బొనర్చిన.59
సీ. బాలారుణ్యప్రభపసిమి నూడ్చినభంగి నిండుకెంజడతలద్రిండుగట్టి
     భసితంపునెఱిపూఁతపై హరిచందనస్థాపకరచన యందముగఁ దాల్చి
     మాణిక్యమౌక్తికమరకతమిళితభూషణము లొయ్యారంపుసరణిఁ బూని
     మందారపుష్పదామంబులు జడముడి నఱుతను జదురుగా నలవరించి
తే. యభినవాకల్పలీల లి ట్లతిశయిల్ల, నిత్యయావనుఁ డభవుండు నీలకంఠుఁ
     డాదిదేవుఁడు వృషభవాహనము నెక్కి, గౌరిముందట నిడుకొని కౌఁగిలించి.60
చ. [2]వెలిగొడు గుత్తమాంగమునఁ బేర్చుతరంగిణిమీఁదిఫేనమం
     డల మనుశంకఁ జేయ ముకుటస్థశశాంకమరీచిజాలముం
     గలసి వికీర్ణచామరశిఖారుచి రెండుకెలంకులందు ను
     జ్జ్వలతఁ దలిర్ప వెల్వడియె సందడిగాఁ గదియన్ గణావళుల్.61
క. వెలువడి బాణుపురంబున, వెలుపల మందాకినీపవిత్రతటమునం
     బొలుపారెడు నెలదోఁటల, నలరెడువాటలకుఁ దొడఁగి యచ్చట నచటన్.62
సీ. భ్రమరనాదములును బ్రకటగంధర్వమృదంగనాదములును దడఁబడంగఁ
     గోకిలా[3]రవములు గోమలకిన్నరీగీతులు నొండొంటిఁ గేలికొనఁగ
     లలితానిలోద్దూతలతలనృత్తములు నచ్చరలయాటలు సరసముగ దొరయ
     నభినవ రాజకీరావళిపలుకులుఁ జారణస్తుతులు మచ్చర మొనర్పఁ

  1. లేఁదేటులు చుట్టికొల్వ
  2. వెలగొడగు
  3. రుతులును