పుట:హరివంశము.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

383

క. మామకశార్‌ఙ్గవినిర్గత, మై మార్గణవేగ మెసఁగి యచ్యుతశార్‌ఙ్గ
     వ్యాముక్తతుచ్చశరతతి, వే ముంపఁగఁ జూతు రింక వేడుక మీరల్‌.107
వ. చక్రాయుధుండును బాంచజన్యలక్షణుండును శార్‌ఙ్గధన్వుండును గదాధరుం
     డును నందకహస్తుండును నైన వాసుదేవుండ నేన కాని గోపాలబాలకునకుం
     బనిగాదు న న్నట్టిప్రశంసనంబులం గొనియాడుండు కొనియాడనివాఁడు సువర్ణ
     నిష్కథాన్యంబుల భారశతంబుల దండం బరువంగలవాఁడు మత్ప్రియసఖుం
     డైన నరకాసురు వధియించి మాఱులేక మలయు నబ్బలియుం బరిమార్చి కృత
     కృత్యుండ నయ్యెద నిది నిశ్చయం బనిన నతని వాక్యంబులు గొంద ఱభినందించిరి
     గోవిందు విక్ర్రమంబునఁ దొల్లి [1]నెట్టంబడినరాజులు సంత్రాసంబు నొందిరి కొంద
     ఱవశ్యంబును విష్ణు నిర్జించి నీకుం ప్రియంబు సేయుదు మని పంతంబులు పలికిరి
     పౌండ్రపతియును యదునగరిపై నరుగ నుత్సాహంబు సేసె నయ్యవసరంబున.108

పౌండ్రకవాసుదేవుఁడు నారదునితో శ్రీకృష్ణుమీఁది వైరంబు చెప్పుట

క. చారుశరీరద్యుతిజిత, శారదనీరదుఁడు ధీవిశారదుఁడు భవో
     త్తారదుఁ డాశ్రితవితతికి, నారదుఁడు దదీయగ్భహమునకు నేతెంచెన్‌.109
క. మునివల్లభునకు నెదురుగఁ జని యర్ఘ్యం బిచ్చి తెచ్చి సముచితకనకా
     సనమున నునిచి యొనర్చెన్ జనపతి పాద్యాదిహృద్యసత్కారంబుల్‌.110
క. అన్నియుఁ గైకొని యతఁడు ప్ర, సన్నతఁ గుశలంబు లడుగ సర్వంబును సం
     పన్నముగం జెప్పి యి ట్లను నున్నతభుజుఁ డగునరేంద్రుఁ డూర్జితబుద్ధిన్.111
మ. సురదైతేయభుజంగమదద్యుచరరక్షో యక్షగంధర్వకి
     న్నరవిద్యాధరగోచరంబు లగునానాలోకముల్‌ లోక[2]జి
     త్వర నీకున్ [3]సుగమంబు లందును గతివ్యాఘాత మేకాలమున్
     బొరయం జెప్పరు నీవిహారసరణిం బుణ్యుండ వీ వెమ్మెయిన్‌.112
క. కావున నెచ్చటి కెచ్చటి, కీ వరిగెద వచటి కచటి కేర్పడ నత్యం
     తావహితబుద్థివై బుధ, సేవిత నాకోర్కి యొకటి సేయఁగ వలయున్‌.113
సీ. సమరపరాక్రమచండుఁడు పౌండ్రుఁడు విఖ్యాతుఁ డఖలపృథ్వీతలమున
     వాసుదేవుం డన వానిపే రంచితచక్రాదిఘోరలక్షణము లెల్ల
     వానివి వాని నెవ్వారికి నిర్జింవ నలవిగా దొకగొల్లఁ డతిచవలత
     నవ్వీరుపేరును నడియాలములు దాను గైకొని యున్నాఁడు గానఁ డొకఁడు
తే. నట్టిపగతుని ననిఁ గూల్చి యద్వితీయ, కముగఁ దనసంజ్ఞ చెల్లింపఁగలుగువాఁడు
     వానిలావును నెరుఁగుదు మానవేంద్రు, లెంద [4]ఱేనియు వానిచే హింస పడిరి.114
వ. అని యివ్విధంబు దప్పక క్రమంబున.115

  1. వేటువడిన
  2. విద్వర
  3. నిగమాదివేద్యసుగతివ్యాఘాత
  4. ఱే నని వానిచే హీనపడిరి