పుట:హరివంశము.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

హరివంశము

     క్తంబు సేయవలసె వినుము నీవు నాకును మానవీయుండవు నీమహత్త్వం బి
     మ్మునులు సకలుసిద్ధులు నెఱుఁగవలయు వివరించెద.74
సీ. ప్రకృతియు గుణములు ప్రకృతిజన్యం బగువికృతిసప్తకమును విను వికార
     ములు పదియాఱునై కలిగినయీప్రోవు మాధవ నీస్థూలమహిమ వీని
     కతిరిక్తుఁ డిరువదేనవుతత్త్వ మీ వని సాంఖ్యులు సూక్ష్మదర్శనులు బుద్ధిఁ
     [1]గని చెప్పుదురు జగజ్జననసుస్థితివిలయంబుల గుణమూర్తివై యొనర్తు
తే. పురుషసూక్తవాచ్యుఁ డపూర్వపురుషుఁ డనుచు, నిన్నుఁ గీర్తింతు రామ్నాయనిష్ఠనుతులు
     విశ్వసంప్రాప్తికతమున విష్ణునామ, మఖిలవిద్వన్నియుక్తమై యతిశయిల్లు.75
క. నారము లండ్రు జలము లిం, పారఁగ నారంబు లయనమై నీ వునికి
     న్నారాయణుఁ డనఁగా నీ, పే రఖిలపురాణములను వెలయుఁ బ్రసిద్ధిన్.76
క. వసధాతువు దివిధాతువుఁ, బొసఁగినవసుదేవసంప్రభూతార్థములం
     దెసఁగుట జగన్నివాసో, భ్యసనరసికు వాసుదేవుఁ డందురు నిన్నున్.77
చ. హరి యన సర్వసంహరుఁడ వౌటఁ బ్రసిద్ధుఁడ వైతి భక్తులం
     గరుణ సుఖాత్మజీవనులఁగా నొనరించుట శంకరుం డనం
     బరఁగితి [2]బృంహణత్వమున బ్రహ్మ యనందగి యీత్రిలోకముల్
     వెరవున విక్రమించుటఁ ద్రివిక్రముఁ డైతి త్రివిక్రమంబులన్.78
క. మధువు లనఁగ నింద్రియములు, మధుద్విషుఁడ వింద్రియప్రమథమున మఱి నీ
     వధికశ్రీనిధి వౌటను, బుధవర్యులు మాధవాఖ్యఁ బొగడుదురు నినున్.79
క. విషయేంద్రియప్రపంచము, హృషీక మనఁ బరఁగు నీ వతీతుఁడవై యు
     న్మిషితముగ నది ధరించుట, హృషీకేశనామశోభి వెందును గృష్ణా.80
క. గోవుమహీదేవి మహీ, దేవిఁ బడసి తీవు ప్రియసతీతిలకమనం
     గావున గోవిందుఁడ వను, భావంబున వామనుఁ డనఁ బరఁగితి పేర్మిన్.81
క. మననంబున ముని యనఁగా, ననఘ తపస్థితిఁ దపస్వి యనఁగా విశ్వం
     బును శాసించుట నీశ్వరుఁ, డనఁగా నీ కివియుఁ బేరులై యొప్పారున్.82
వ. నీవు సకలచ్ఛందంబులయందును గాయత్రియు వేదంబులయందుఁ బ్రణవంబును
     వర్ణంబులయం దకారంబును నాదిత్యులయంచు విష్ణుండును రుద్రులయందు శంక
     రుండును మనువులయందు స్వాయంభువుండును నగ్నులయందుఁ బావకుండును
     దేవతలయందుఁ బురందరుండును గుహ్యకులయందుఁ గుబేరుండును దేవమునుల
     యందు నారదుండును దైత్యులయందఁ బ్రహ్లాదుండును సర్పంబులయందు
     వాసుకియు నదులయందు గంగయుఁ బర్వతంబులయందు మేరువు నై యుండు
     దువు సర్వవస్తువులయందును నుత్తమం బైనయట్టిభవద్విభూతివిశేషంబును భవ

  1. గని చెప్పుదరు జగజ్జనములు సుస్థితి విలయంబు గుణమూర్తి లలినొనర్తు
  2. బ్రాహ్మ