పుట:హరివంశము.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

372

హరివంశము

తే. నీనగంబుక్రేవలు ప్రమథేశ్వరులకు, రుద్రకన్యాసహస్రంబు రుచిరకేళి
     నలరునెలవులై యెంతయు నమరు ననినఁ, బొగడఁదగదె యీరాజతభూధరంబు.9
తే. తలలు దఱిగి పూజించినదర్పలీల, సెసఁగువీరుఁడు నీశైల మెత్తఁబోయి
     బాహు లిఱుకంగఁ దాల్మిని బాసి కూసె, దీనిగౌరవంబున కెద్ది మాన మరయ.10
మ. తొమ్మిదిపెన్నిధానములు దూఁకొని యర్థవిభుం డనం బ్రశ
     స్తమగుపేర్మి నిందుధరుసఖ్యము గాంచినమేటి యొండుచో
     టిమ్మెయి మెచ్చ కివ్వరమహీధరుపాదము నాశ్రయించి సౌ
     ఖ్యమ్మున మూరిఁబోయెఁ బెఱయద్రుల కింతటిపేర్మి గల్గునే.11
శా. యక్షస్త్రీస్తనభంగురోర్మి యలకేశాంతఃపురోత్తంసతా
     దక్షస్వర్గసరోజ కిన్నరవదద్వంద్వానుభూతస్థలీ
     వృక్షచ్ఛాయ వియత్తరంగిణి పయోవేగంబున న్నిత్యముం
     బ్రక్షాళింపఁగ నొప్పుదీని[1]చఱు లీభద్రంబు సామాన్య మే.12
చ. అనిశము సార్వభౌమకరి యంజనపైఁ గమనీయపుష్కరం
     బునఁ గనకంపుఁజెంగలువపుప్పొడి నొప్పగునీరు సల్లఁగాఁ
     [2]దనరుచు నంచకాఁపులకుఁ దానకమై కడ లుల్లసిల్లఁ బెం
     పెనసినమానసం బమరు నిచ్చలు మెచ్చరె యిమ్మహీధ్రమున్.13
మ. కరులు సింగములున్ వృకంబులుఁ గురంగంబుల్ భుజంగంబులున్
     బురినెమ్ముల్ మొదలైన కాననచరంబుల్ వైరము ల్దక్కి శం
     కరసంస్మృత్యనుభూతియం దొకటి కైక్యప్రీతితోఁ దెల్పుచున్
     బరఁగుఁ దీనితటంబునఁ శుభద మిప్పట్టాత్మవిత్కోటికిన్.14
సీ. అలిగి దక్షాధ్వరం బఱవఱసేయంగ భద్రతేజుని వీరభద్రుఁ బనిచె
     దర్పించి పలికినఁ దలద్రుంచి కమలజుఁ గ్రొవ్వడఁగింప రుద్రులను బనిచె
     నన్యాయకారియై యడరినయంతకుఁ బ్రహరింపఁ గాలభైరవునిఁ బనిచె
     నిజభక్తరక్షణనిష్ఠ మై మృత్యువు భంగింపఁ బహుగణప్రతతిఁ బనిచె
తే. నర్థి నిమ్మహాచలము సింహాసనముగ, నెలమితో నుండి విశ్వలోకేశ్వరుండు
     నమరవాసంబు మొదలుగా[3]నన్యభూము, లెఱుఁగఁ డీశంభునకు మెచ్చు నిదియె కాదె.15
వ. అని బహుప్రకారంబుల బహుమానతత్పరుం డగుచు నటఁ బరిక్రమించి.16
క. ఇదే ప్రేపయడవి ప్రమథులు, ముదమున శతకోటిసంఖ్య ముసరికొని ప్రియం
     బు దలిర్ప దీనఁ గోలలు, గుదియలుఁ గైకొండ్రు తమకుఁ గోరి ధరింపన్.17
మ. అదె నందీశ్వరవేత్రవారితనిలింపాజస్రసమ్మర్దసం
     పద సొంపారెడుశంభు[4]గోపురము సంభావ్యంబు లై మించె నిం
     పొదవంగా నవె శర్వగేహమణిశృంగోన్నద్ధచామీకరో
     ద్యదనేకధ్వజవైజయంతిక లమందాందోళనోల్లాసముల్.18

  1. తరు
  2. తనరఁగ
  3. నన్యబాము, లెఱుగఁ డీశంభుఁ డతనిమె చ్చెదియకాదె
  4. కాఁపురము