పుట:హరివంశము.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 5.

369

     ట్లనఘా పుచ్చితి నీవు గావునఁ బ్రమోదాత్ముండ నైతిం గృపం
     [1]గని నీ కిత్తు నమర్త్యతుల్య మగునాకం బెందుఁ గీర్త్యంబుగాన్.236
వ. అని యానతిచ్చి వరదవరేణ్యుం డగు నాసర్వలోకశరణ్యుం డప్పుణ్యుదేహంబు
     మోదావహం బగు తన దివ్యపాణిపయోరుహంబున సంస్పర్శనంబు సేసిన.237

ఘంటాకర్ణుఁడు పిశాచదేహంబు వదలి పుణ్యలోకంబునకుం బోవుట

తే. పరుసవేది సోఁకుటయును బరుషలోహ, మధికశుద్ధసువర్ణ మైనట్టిపోల్కి
     నతని కేలుదామర సోఁకి యాక్షణంబ, [2]యాపిశాచరూపము మాని యద్భుతముగ.238
చ. అమరులు సిద్ధు లాదిమును లాదిగ దివ్యతపంబు భవ్యయో
     గముఁ దగ నిర్వహించియును గానఁగ నేరని యట్టి దివ్యరూ
     పము ధరియించె సర్వగుణభాసిగ నాతఁడు చారుగంధవ
     స్త్రమహితభూషణావళులు తత్సదృశోదయలీలఁ బొల్పుగాన్.239
క. అది యట్టిద యచ్యుతుఁ దన, హృదయంబునఁ దాల్చుసుకృతి కెచ్చోటను నె
     య్యదియును బ్రాఁతియె యణిమా, ద్యుదితపదము లతనిచేత నున్నవి గావే.240
వ. ఇట్లు సిద్ధత్వంబు నొంది సిద్ధపూర్వాంగుం డైన యనంగుభంగి నంగీకృతాద్భుత
     దేహుం డైన మేఘవాహువిధంబున నక్షయతనులాభాతిశయుం డైన తారాద
     యితుచందంబున నానందమయశరీరుం డైనయయ్యుదారుదెస నాలోకించి యా
     లోకేశ్వరుండు.241
మ. త్రిదివం బెంతటిదాఁక నేలు నెలమిన్ దేవేంద్రుఁ డందాఁక స
     మ్మద మొప్పారఁ దదీయమిత్రపదవిన్ ధన్యుండ వై యుండు త
     త్పదవిచ్ఛేదము పిమ్మటం బ్రకటమత్సాయుజ్యసంప్రాప్తి నీ
     కొదవున్ వేల్పులకైన నంద దది నీవొక్కండవుం డక్కఁగాన్.242
క. వరముగ నిచ్చితి నీకున్, గురుత్వదశ మింతకంటెఁ గోరిక మదిలోఁ
     దిరముగఁ గలిగిన నడుగుము, సురాసురప్రముఖులకు నసులభమ యేనిన్.243
వ. అనిన ఘంటాకర్ణుం డుదీర్ణపూర్ణుం డగుచు నీలవర్ణునకు సాష్టాంగప్రణతుం డై
     లేచి నిలుచుండి మొగిచిన కేలు ఫాలంబునం గదియించి.244
ఉ. దేవర సుప్రసాదశుభదృష్టిసుధావిసరంబు నాపయిన్
     వావిరి వెల్లిగొల్పితి మనంబున కింకొకవెల్తి గల్గునే
     దేవకులేశ యైనను మదీయమనీష నితాంతభక్తి నే
     త్రోవల నెమ్మెయిం దొలఁగఁ ద్రొక్కక నిన్ భజియింపఁ జేయవే.245
వ. అనిన నవ్వరం బట్ల యొసంగి వాసు దేవుం డతని వీడ్కొలిపె నాసిద్ధుండును సిద్ధ
     గతి నరిగె నని.246

  1. గను నీ కిచ్చెద గరతుల్యమగుపాఠం బెందు
  2. యప్పిశాచభావము మాని