పుట:హరివంశము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

పదునాల్గవశతాబ్ది ప్రారంభమున నాంధ్రసామాజ్యలక్ష్మీధురంధరుఁడగు నోరుగంటి ప్రతాపరుద్రుఁడు ఢిల్లీ చక్రవర్తిచే నోడించబడి చెఱపెట్టబడినవా డగుటచే, నంతకుఁ బూర్వము రెండు శతాబ్దములనుండి శత్రుభయంకరులై మహాధీమంతులై పరిపాలనాదక్షులగు మహావీరులకు జన్మస్థాన మైనట్టియు, విద్యానాథాదిగీర్వాణమహాకవులకును, పాల్కురికి సోమనాథ, మారన, మంచన, తిపురాంతకాది ఆంధ్రమహాకవులను రుద్రభట్ట, హరీశ్వర రాఘవాది కర్ణాటక కవీశ్వరులకును నాశ్రయభూతులైన భాషాపోషకుల కునికిపట్టయినట్టియు, కాకతీయసామ్రాజ్యము భగ్నము కావలసి వచ్చెను. అప్పుడు ప్రతాపరుద్రునిచే నాయామండలాధికారులుగ నియమింపఁబడిన నాయకులు తమస్వాతంత్ర్యమును బ్రకటించుటచే నాంధ్రదేశమున ననేకరాజ్యములు బయలుదేరినవి. అందు ప్రథమమున నాచన సోమనాథాది మహాకవుల కాశ్రయమైనట్టియు, బిదపఁ బదునాఱవశతాబ్దమున నష్టదిగ్గజములని ప్రసిద్ధి గాంచిన మహాకవులకుం బోషకుఁడై ప్రబంధయుగమునకు మూలమై విద్వద్రాజశిఖామణియగు కృష్ణదేవరాయని వలన దిగంతవిశ్రాంతకీర్తిం బడసినట్టిదియు నగు కర్ణాటరాజ్యము మొదటిది. నెల్లూరు మొదలుకుని సింహాచలము వఱకును గల భూమి నాక్రమించుకొని ప్రథమమున నద్దంకియుఁ బిదపఁ గొండవీడును రాజధానులుగ నూఱేండ్ల వఱ