పుట:హరివంశము.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

341

వ. దానన కాదె దామోదరనామం బిమ్మహాతునకుం బ్రసిద్ధం బయ్యె
     మఱియు.254
శా. కాళిందీనది సొచ్చి కాళియమహాకాలహి నుద్యద్విష
     జ్వాలాకర్లకరాళవక్త్రుఁ బడగల్ స్రగ్ధం బడం ద్రొక్కుచుం
     గేళీనర్తన మాచరించి యడఁచెన్ గృష్ణుండు గోపాలనా
     వేళం [1]జేసెను నమ్మహాతునకునుం ద్వేషంబు లాభీలముల్.255
క. జడిదాఁకి వడఁకుపసులకు, గొడుగుగ దివసంబు లేడు గోవర్ధనమున్
     [2]వడిఁ బెరికి యట్లు దాల్చిన, కడిఁదిబలం బరయ హరికిఁ గలరే సదృశుల్.256
మ. సకలారిష్టుఁ డరిష్టుఁ డన్ దనుజుఁ డిచ్చన్ గోపికాభీకర
     ప్రకటోత్తుంగశరీరుఁడై వృషభరూపస్ఫూర్తిమైఁ బాఱుదెం
     చి కఠోరం బగుశౌరిబల్లిదపుముష్టిం గష్టమృత్యుప్రస
     క్తికిఁ బాలయ్యెఁ బ్రవృద్ధిబొందదె త్రిలోకీహర్ష మై యిమ్మెయిన్. 257
క. తురగాకృతి యగ దానవు, నిరుపరియలు గాఁగఁ జీరె నేమని పొగడన్
     బురుషోత్తముశితనఖభీ, కరపాణిక్రకచ మెట్టికడిమియొ కనుఁడా.258
తే. స్నానవేళన యక్రూరునకు భుజంగ, భోగశాయిని యగునిజపుణ్యమూర్తి
     నియతి [3]బ్రత్యక్షముగఁ జూపి నిరతమహిమ, దెలుపఁడే యాతఁ డతిధన్యదృష్టి నలర.259
క. అవలీలఁ గువలయాపీ, డవిభేదనశక్తి నుత్కటం బగుయశ మి
     య్యవనీధరుం డొనర్పఁడె, యవిరళవిస్ఫూర్తిఁ గువలయాపీడముగాన్.260
క. లీల మెయిం జాణూరుం, గోలెమ్ము లితండు విఱిచి ఘోరధ్వని జం
     ఘాలుం డై పంపెఁ గదే, త్రైలోక్యమునకు మనోజ్ఞతరశుభవార్తన్.261
చ. ఘనచరణావఘాతమునఁ గంసుశిరోమణు లుర్వి రాల్చి యి
     య్యనుపమశౌర్యుఁ డంఘ్రినఖరాభిహతిం గరికుంభపీఠభే
     దన మొనరించి మౌక్తికవితానము రాల్చుమృగేంద్రువిక్రమం
     బు ననుకరించెఁ దత్కథలు మ్రోయుచు నున్నవి లోకపఙ్క్తులన్.262
క. చచ్చినసాందీపునిసుతుఁ, దెచ్చె జముని నొడిచి యనుచు దితిజధ్వంసున్
     మెచ్చుట [4]యాటది యీతని, యిచ్చకు మార్పడఁగ వశమె యేవేల్పులకున్.263
వ. మఱియు ననేకవీరలోకసహాయుం డగుజరాసంధుం బరాజితుం గావించుటయుఁ
     గాలయవనుం గాలవశంబు నొందించుటయు రుక్మిం బరిభవించి రుక్మిణీదేవి
     నుద్వహించుటయు మురపాశకర్తనంబులు మొదలయినపనులు మున్నుగా నరకుం
     గూల్చుటయుఁ బారిజాతంబు నపహరించుటయు నాలోకింప వైకుంఠపౌరు
     షోత్సేకంబు లతిలోకంబు లిటమిఁదను వాణాసురావనంబు శిశుపాలపాతనంబు
     సాల్వహననంబు ధనంజయసాహాయ్యకంబు మొదలుగా నిమ్మహాత్ముండు విచిత్రంబు
     లగుదివ్య చరిత్రంబులు ప్రకటింపం గలవాఁ డివ్విధంబున నివ్వసుంధరపై నతి చిరం

  1. జూచిన నమ్మహాతునకునుం ద్వేషంబు
  2. కడఁకఁ బెరిగి యది
  3. బ్రత్యయ
  4. యేఁటిది; యేలది.