పుట:హరివంశము.pdf/367

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 4.

319

క. యాదవులుఁ గుమారులును మ, హీదేవోత్తములు వృద్ధహితమంత్రులు స
     మ్మోదమున బలసికొలువ మ, హాదీప్తాసనముమీఁద నలరుమహాత్మున్.67
సీ. నీలాద్రిఁ దనరుమాణిక్యపుశిఖరంబుక్రియ రత్ననూత్నకిరీట మెసఁగ
     గగనంబునడిమిచక్కటి నొప్పునరుణాంశుకరణిఁ గౌస్తుభము వక్షమున వెలుఁగ
     జలరాశిఁ బొదివినసాంధ్యపయోదంబుక్రమమునఁ బీతాంబరము దలిర్ప
     మేచకాభ్రంబున మెఱయుసురేంద్రచాపములీల వనమాల ప్రస్ఫురిల్ల
తే. నల్లనునుఁజాయ మే నొప్పఁ దెల్లదమ్మి, విరుల సిరిగన్న కన్నుదో యరుదుగాఁగ
     నమరుజగదీశు సకల[1]హితార్థజను, జన్మవిరహితు వసుదేవజాతుఁ గాంచి.68
వ. ఆనందశీతలచేతస్కులై యంతంతం దమలోన.69
ఉ. అక్కఱ లెల్లఁ దేల్చి జను లందఱఁ బ్రోచుటకున్ బ్రసన్నుఁ డై
     యిక్కరుణాకరుం డిచట నిట్లెలరారఁగ నింతకాలమున్
     రక్కసుచేత నక్కట పరాభవ మొందిత మెవ్విధంబులన్
     నెక్కొనకున్నె మర్త్యులకు నిక్కము ప్రాక్తనభోగ్యకర్మముల్.70
వ. అదియునుం గాక.71
మ. పరమాత్మున్ హరిఁ జూత మంచుఁ గనుఱెప్ప ల్మోడ్చి లోలోన వే
     తెరువుల్ వాఱుమనంబుఁ బట్టి బలిమిన్ [2]దివ్వంగఁ దివ్వంగ దు
     స్తరదుశ్శాసిక యయ్యెఁ [3]బూర్వవిధి ప్రత్యక్షంబుగా నమ్మహా
     పురుషుం గంటిమి నేటనుండి సుకరంబుల్ సిద్ధిపారంపరుల్.72
క. తపము తప మంచు నడవుల, నుపగతజడబుద్ధి [4]మనికి యొందఁగ హరిఁ జూ
     పుపకారంబయ్యె రిపుని, యపకారం బిట్టిభాగ్య మబ్బుటకతనన్.73
వ. అనుచుం గదియఁ జనుదెంచుటయు జనార్దనుండు ససంభ్రమంబుగా సముత్థి
     తుం డై సంయమితతికిం బ్రణామంబు సేసి యాసనార్ఘ్యపాద్యమధుపర్కం
     బులఁ బరిపాటితోడం బూజ యొనరించి తదనుమతి నార్మీయం బగు నాసనం
     బున నాసీనుం డయ్యె వృష్ణ్యంధకభోజవరులును వారలకు నమస్కరించి యథో
     చితస్థానంబుల నుండి రప్పుడు కృష్ణుండు కృతాంజలి యై యమ్మహామునుల
     కి ట్లనియె.74
క. క్రతువులు నిర్విఘ్నము లే, శ్రుతములు ధృతము లై యసన్నిరుద్ధము నై మహా
     వ్రతములు తపములును ననుప, హతము లై కళ మేమీ యుష్మదాగమమునకున్.75
మ. పరమబ్రహ్మపదైక్యబోధమహిమం బ్రాజ్యంబు మీయోగభా
     స్వరసామ్రాజ్యము ధర్మనిత్యము భవత్సత్యంబు మీ రీయెడన్

  1. జాతాహితార్థు
  2. దింపంగ దింగంగ
  3. దుఃఖాదిక
  4. నునికి వొందర