పుట:హరివంశము.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

307

     జుని [1]గౌఁగిలించె రుక్మిణి, యనుమోదము నొంది రచ్యుతాంగన లెల్లన్. 208
వ. ఇట్లు కుమారుండు ప్రత్యాగతుం డైన యమ్మహోత్సవం బంతఃపురంబున ననేక
     ప్రకారం బై పరఁగి సర్వజనంబులం బ్రహర్షభరితులం గావించె నని చెప్పి వైశం
     పాయనుండు వెండియు జనమేజయున కి ట్లనియె.209
క. విను ప్రద్యుమ్నుఁడు రుక్మిణి, కనఘా తొలుపట్టిఁ గాఁగ నాత్మజులు క్రమం
     బునఁ దొమ్మండ్రు [2]మఱియు సం, జనితు లయిరి కన్య [3]యొకత జనియించెఁ దుదిన్.210
వ. వారలు చారుధేష్ణుండును సుధేష్ణుండును సుషేణుండును జారుగుప్తుండును జారు
     వాహనుండును జారువిందుండును జారుదద్రుండును జారుగర్భుండును జారుం
     డును [4]జారుమతియు ననఁ దదీయనామంబులు దక్కిన దేవులయందును భానుం
     డును భానువిందుండు సంగ్రామజిత్తు దీప్తిమంతుండు వృకుండు మొదలుగాఁ
     బెక్కండ్రు గొడుకులును మిత్రవతీప్రముఖ లగు కన్నియలును జనియించిరి.211
క. విను ప్రద్యుమ్నుఁడు జనియిం, చిన నెలలోపలన పుణ్యశీలుఁడు పుత్రుం
     డనుపమశౌర్యుఁడు సాంబుఁడు, జనియించెను జాంబవతికి జగదభినుతుఁ డై.212
తే. శైశవమునంద కరము వాత్సల్య మెసఁగ, నక్కుమారు నాలధ్వజుఁ డాత్మతనయుఁ
     గాఁగఁ గైకొని పెనిచి విఖ్యాతుఁ జేసె, హయగజారోహశస్త్రాస్త్రచయములందు.213
వ. ఆబలభద్రునకు రేవతీదేవియందు నిశాతుండు నుల్ముకుండు ననుపుత్రులు మహాస
     త్త్వులు జనియించి రిట్లు పుత్రవంతుం డై యదుకులైకకాంతుం డనంతగజతురగ
     సంకీర్ణయు నపరిమితవస్తుపరిపూర్ణయు నగు రాజలక్ష్మి ననన్యసాధారణసామ
     ర్థ్యంబున ననుభవించుచుండె నట్టి సమయంబున.214

ప్రద్యుమ్నుండు రుక్మికూఁతు రగు శుభాంగిని స్వయంవరంబున వరించి వివాహం బగుట

సీ. అట విదర్భాధీశుఁ డగు రుక్మి దనపుత్రి యైన శుభాంగి నన్వర్థనామ
     నసమయౌవనసముల్ల[5]సన యై యుండంగఁ గనుఁగొని యనురూపకాంతుఁ డింతి
     కొదవెడుతెఱఁ గాత్మ నూహించి మహితస్వయంవరోత్సవము సమ్యగ్విభూతి
     నాచరింపంగఁ దదాహూతు లై యుర్విఁ గలరాజు లెల్ల నగ్గలపువేడ్క
తే. నంచితైశ్వర్యలీల నింపారభోజ, పురికిఁ బోవఁగ రుక్మిణీవరసుతుండు
     నుచితపరివారసహితుఁ డై యుల్లమలర, నరిగెఁ దల్లియుఁ దండ్రియు ననుమతింప.215
వ. ఇవ్విధంబున సముపాగతు లైన భూపతులం బ్రభూతసంభావనలం బ్రముదితులం
     గావించి శుభదినంబున రుక్మి యమ్మహోత్సవంబు ప్రవర్తించిన.216
మ. మును గోవిందసుతుండు దానునుఁ బ్రియంబు ల్మీఱ నన్యోన్యశో
     భనరూ[6]పోరుగుణావళు ల్వినికిఁ దో బద్ధానురాగాత్ము లై
     యునికిం గన్నియ యత్తఱిం దగిలి సర్వర్వీశులుం జూడ నా
     తనిఁ బ్రీతిన్ వరియించెఁ గోర్కులు కృతార్థత్వంబునుం బొందఁగన్.217

  1. గౌఁగలించె
  2. రు దగ
  3. యొకతి
  4. జారువతి
  5. సితయై
  6. పంబు