పుట:హరివంశము.pdf/354

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

హరివంశము

ఆ. [1]వెఱుఁగుపాటుతోడి వెఱపు నాకస్మిక, సమ్మదంబు మానసంబు నొలయఁ
     గృష్ణభామలెల్లఁ దృష్ణాతిలోలేక్ష, ణములఁ గ్రోలి రతని నవ్యమూర్తి.199
వ. రుక్మిణియు నద్భుతాకాంతస్వాంత యై నిజాంతర్గతంబున.200
చ. అతులితయౌవనోదయుఁడు హారిసలక్షణమార్తి యీతఁ డి
     య్యతివయుఁ దాను నిచ్చటికి నాదటమైఁ జను దెంచు టేమియో
     యితనిఁ దనూజుఁగాఁ గనినయింతి జగంబున నెందుఁ దాన యూ
     ర్జిత యగు భాగ్యసంపదఁ బ్రసిద్ధివహింపక యున్నె యున్నతిన్.201
తే. అకట ప్రద్యుమ్నుఁ డాభంగి నవధిఁబోయె, సదయుఁ డైన[2]విధాతచే నసురచెయిది
     ననుపమాకారుఁ డవికారుఁ డట్టిపట్టి, [3]బ్రదికెనే నింతకును నింతబంటు గాఁడె.202
మ. [4]ఇతఁ డాపాపనియట్ల వెండ్రుకలు మో మింపారుకన్ను ల్జగ
     న్నుతుఁ డబ్జాక్షునిపోల్కి కేలు నురము న్మూర్ధంబు మోమోటకుం
     బ్రతి యే మే నొకదైవసంఘటన మైఁ బ్రాణవ్యపాయంబు లే
     క తగం బుత్రుఁడు వచ్చెనొక్కొ నను మాంగల్యోజ్జ్వలన్ జేయఁగన్.203
వ. అని తలంచుచుండఁ బుండరీకాక్షుండును [5]బ్రమోదవికృతాక్షుం డగుచుం
     బుత్రు నాలోకించె నాలోనన నారదుండు చనుదెంచి నారాయణునకు నక్కు
     మారు జన్మకారణంబును శంబరవధావసానం బగు తచ్చరితంబును నెఱింగించిన
     నమ్మునీంద్రుని మున్నిడుకొని కృష్ణుండు రుక్మిణిపాలి కరుగుదెంచి.204
మ. ఉవిచా యీతఁడు నీతనూజుఁ డగు ప్రద్యుమ్నుండు దుర్దాంతచా
     ప[6]విశేషోజ్జ్వలహస్తుఁ డాహవమునం బ్రత్యర్థి నత్యుగ్రదా
     నవు నాశంబరుఁ గూల్చి ఘోర మగ తన్మాయాచయం బంతయుం
     బ్రవరుండై హరియించి వచ్చె నెలమిన్ భార్యాసమేతంబుగన్.205
క. ఈయమ నీకోడలు విను, మాయావతి యనఁగ భువనమాన్యచరిత్ర
     శ్రీయుత యైనది సుమన, స్సాయకునకుఁ దా నభీష్టసహచరి మొదలన్.206
వ. అమ్మకరకేతనుండు భూతేశ్వరునయనజ్వాలాకలాపంబున నాపన్నుండైన నిన్నాతి
     శంబరువశంబునం జిక్కి తన మాయామయం బగు రూపం బొక్కటి వాని కను
     భవగోచరంబు సేసి తాను బొందక యనిందితం బగు చందంబున నింతగాలంబు
     నడపి జన్మాంతరగతుం డగు నిజభర్తం గ్రమ్మఱ భజియించె నిప్పుణ్యశీల నాత్మ
     గృహాలంకారంబుగాఁ గైకొను మని చెప్పిన.207
క. విని సమ్మదంబు చిత్తం, బునఁ గడలుకొనంగఁ బ్రణతమూర్తి యగు తనూ

  1. ఆ. వెఱఁగుపాటుతోడి వేడ్క నాకస్మిక, ములను మానసంబు నొలయ నందుఁ
    గృష్ణభామ లెల్లఁ దృష్టావిలోకన, ములను గ్రోలి రతనిమూ ర్తిఁ బ్రీతి.
  2. విధాతృచెయిది కరంబు
  3. బ్రతికియుండిన నింతకు బంటు గాఁడె; బ్రతికెనేని యింతకు బట్టునింతరాఁడె.
  4. ఇతఁడా నాసుతుఁబోలు వానివలె
  5. ద్రికాలవేది యగుచు
  6. వరాస్త్రాదుల