పుట:హరివంశము.pdf/350

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

హరివంశము

క. అందఱకు నుచితసత్కృతు, లొందఁగ నొనరించెఁ బ్రభునియోగంబున న
     స్పందమతియుతుఁడు సత్యక, నందనుఁ డభినందనీయనైపుణయుక్తిన్.160
వ. తదనంతరంబ లగ్నదివసం [1]బుదితం బగుటయు.161
సీ. ఆపూర్ణవర్ణసమర్థస్వరంబుల నలరుభూసురులయధ్యయనరవము
     మధురసల్లాపసమ్మదరసోత్సవమునఁ బొదలు రాజులవచోభ్యుదితరవము
     లలితవిలాసలీలాఖేలలను గ్రోలుచపలలోచనలభూషణరవంబు
     జన్యజనారూఢచతురంబు లగుహస్తిహకులబృంహితహేషితారవంబుఁ
తే. గలసి కల్యాణవాదిత్రకలితగేయ, రవముతో సాంద్రమై మనోరంజనముగ
     దెసలు నిండించి దివమున దేవదుందు, భిప్రణాదంబు లొక్కట బెరసి చెలఁగ.162
వ. అంత నత్యంతమనోహరానేకసంస్కారపరిణతం బగుపరిణయమండపంబునం గమ
     నీయకాంచనస్తంభచతుష్టయసంభృతయు మాణిక్యఖచితవిచిత్రవితానవికసితయు
     మంగళరంగవల్లీరచనారుచిరయుఁ జతురంతనిబద్ద[2]మరకతతోరణమణిదర్పణాభి
     రామయు సువర్ణపాలికాసమర్పితకుసుమాంకురాలంకృతయు నుపాంతవిన్యస్త
     రత్నదీపికాశోభితయు నగుభద్రవేదికయందుఁ బురోహితుం డగ్నిముఖంబు చేసి
     వేల్వ నుగ్రసేన వసుదేవ బలదేవ ప్రభృతి గురువృద్ధవరులును బ్రసిద్ధతపస్వి
     [3]పుంగవులును బలసి యుండ వాసుదేవుండు తదనుజ్ఞాపూర్వకంబుగా శుభ
     ముహూర్తంబున.

రుక్మిణీకల్యాణమహోత్సవప్రకారము

సీ. సౌకుమార్యమునకు సౌకుమార్యస్ఫూర్తి గలిగించు[4]నవయవకల్పనంబు
     సౌందర్యమునకును సౌందర్యసంపద యొదవించులావణ్యయోగరుచియు
     సౌభాగ్యమునకును సౌభాగ్యవిభవంబు [5]గావించు సరసరేఖాశ్రమంబు
     సౌశీల్యమునకును సౌశీల్య [6]కలనంబు నందించునాభిజాత్యస్థితియును
తే. దనకు నైజంబులుగ నొప్పుధన్య ref>జన్మ</ref>జన్య, రుక్మిణీదేవి నానందరుచిరమూర్తి
     బాణిశంకజగ్రహణకల్యాణలీలఁ, బ్రీతి గడలొత్తుచుండఁ బరిగ్రహించె.163
క. లలిఁ బుణ్యాంగన లొలికెడు, లలితాక్షతములు వియత్తలమున నమరకాం
     తలు గురియుకుసుమవర్షం, బులు నొక్కట కృష్ణు[7]మేను భూషించె సరిన్.164
తే. సురలయిచ్చుదీవనలు భూసురులయిచ్చు, దీవనలుఁ గూడి యద్భుతోదీర్ణలీల
     జనులయాకర్ణనంబు లుత్సవమునొంద, బరఁగె [8]నభినవార్థోదాత్తపదము లగుచు.165
వ. ఇవ్విధంబునఁ గృతవివాహుం డై గోవిందుండు జననీజనకులకు వంశవృద్ధులకు
     నమస్కరించి వారి వాగ్విశేషంబుల నభినందితుం డై యనేకబ్రాహ్మణోత్తములకు

  1. ముత్థితం
  2. మకర
  3. పరులును
  4. నవనవ
  5. గలిగించు
  6. కల్పితయం
  7. మీఁద
  8. నభినవోదాత్తసత్పథము