పుట:హరివంశము.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

హరివంశము

క. క్రథకైశికు లాదిగఁగల, రథికులు బహురథసముత్కరంబులతో నా
     రథచరణపాణిమీఁదం, బ్రథితోత్సాహమునఁ గదిసి బలువిడి [1]నేయన్.139
ఉ. వారల బాణవర్షములు వారక నిల్పుచుఁ దాను వారి దు
     ర్వారశరవితానపరివారితదేహులఁగా నొనర్చుచున్
     వారిజనాభుఁ [2]డుద్యదనివారితశోణితవారిధారలన్
     వారలఁ దోచె వీరు లగువారలకెల్ల నొకండ మేటియై.140
క. అంతటిలో రుక్మియును ర, థాంతరగతుఁ డై మహారయంబుమెయిన్ దై
     త్యాంతకు మార్కొని విశిఖ, ధ్వాంతము దిగంతరాతతమ్ముగఁ జేసెన్.141
తే. హరియు నతనిపైఁ బెల్లుగ నంపగములు, వఱపే వైదర్భుఁ డచ్యుతు గరుడకేతు
     వొక్కయమ్మున సారథి నొకశరమునఁ, దాఁక నేసి రథ్యంబులఁ దరల నేసె.142
క. కినిసి విభుఁ డహితువిలు ద్రుం, చిన నారుక్మియును గరము శీఘ్రమున శరా
     సనమొం డొక్కటిఁ గైకొని, దనుజధ్వంసకుని గెలువఁ దమకించి వడిన్.143
తే. వరుసమాహేంద్రవాయవ్యవారుణములు, రౌద్రగాంధర్వపైశాచరాక్షసములు
     నైనదివ్యాస్త్రములు వారిజాక్షుమీఁద, వెసఁ బ్రయోగించె జతనంబు విస్తరిల్ల.144
క. అని యన్నియు దామోదరుఁ, డపహితచిత్తుఁ డయి తత్తదస్త్రమ్ముల సం
     ప్రవిహతములు చేసి యతని, యవయవములు బహుళశరచయంబులఁ బొదివెన్.145
వ. పొదివి తోడన కోదండంబు [3]ఖండించి రథ్యంబుల వధియించి సారథిం దెగటార్చి
     రథంబు నఱికిన నతం డొండ్డనంబు నడిదంబునుం గొని తొలంగ నురికి విపక్షుండు
     సపక్షం బగునద్భుతభుజంగంబుభంగి నాభుజంగభంజనుదెసం గవియుదెంచిన.146
ఆ. పలుక వగుల నేసి యలుఁగు దుత్తునియలు, గా నొనర్చి శౌరి గనలు మిగుల
     నారసములు మూఁటఁ బేరురం బుఱక వ్ర, చ్చినఁ గరంబు నొచ్చి చేష్టదక్కి.147
వ. రుక్మి ధరణీతలంబున ముడింగి పడియె నట్లైన యతనిం జూచి.148
క. బలమెల్లఁ జెదరి నాలుగు, వలఁకులఁ జెడిపోయే దొరలు వడి నాఁబోతుం
     బులిగొనినఁ గలుగుపసుల, ట్లలఘుభ్రమఁ బొంది యొదిఁగి రచ్చటనచటన్.149
క. శరదలితదేహుఁడై భువిఁ, బొరలుచు నున్నతనితోడఁబుట్టువుఁ గని ని
     ర్భరశోకంబున రుక్మిణి, యరదముపై వ్రాల యార్తి నాక్రందించెన్.150

శ్రీకృష్ణుఁడు రుక్మి మూర్ఛితుం జేసి రుక్మిణిం గొని ద్వారకకు వచ్చుట

వ. వృష్ణిపుంగవుండు నయ్యంగనం గౌఁగలించి మెత్తన యెత్తి యాశ్వాసించి రుక్మికి
     నభయం బిచ్చి రథంబు గ్రమ్మఱింప సారథి నాజ్ఞాపించి ప్రియకుం బ్రియం బొన
     ర్చినవాఁడై.151

  1. గవియన్
  2. డుద్యత
  3. ద్రుంచి