పుట:హరివంశము.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

299

     సత్యకతనయుండును నహితుల నపజితులం జేసి యార్చి శంఖం బొత్తిన నయ్యులివు
     విని జనార్దనుండు జరాసంధపలాయనంబు నిశ్చయించి తానును బాంచజన్య
     స్వనంబు నలు[1]దెసలఁ నిండించె నంత.131

రుక్మిణీసహోదరుండగు రుక్మి యనువాఁడు శ్రీకృష్ణునితో యుద్ధంబు సేయుట

సీ. ఆమగధేశుఁడు నఖిలరాజన్యులు నమ్మెయి వృష్ణిసైన్యంబు పిఱుఁద
     నరిగెడునప్పుడ యట రుక్మియును రుక్మిణీహృతివార్తకు నిబ్బరంబు
     కోపంబుతో నాజి గోవిందుఁ దునిమి రుక్మిణిఁ గొని రాక యాత్మీయపురము
     సొర నని తండ్రియుఁ జుట్టలు వినఁ బంతమిచ్చి సన్నద్ధుఁడై యేపు మిగులఁ
తే. గదలె గదుఁడు కైశికుఁ డాదిగాఁగఁ గలుగు, యోధముఖ్యులు బహుళసైన్యోద్భటముగ
     నాయితంబయి యాతని ననుసరించి, రనుజహితబంధుకోటియు [2]నడరెఁ గడిమి.132
వ. మఱియు దక్షిణాపథనివాసు లగు నంశుమత్క్రోధ శ్రుతపర్వ వేణుధారి
     ప్రముఖమహీపతులు తమతమవర్గంబులం గొని యతనితో నేకకార్యు లై కడంగి
     రట్లు నడచి నర్మదాతటానుసారి యై యరుగు శౌరిరథం బొక్కటియు దవ్వులం
     గడచి యుద్ధార్థుం డై చని వైదర్భకుమారుండు శూరమాని గావున నందరం
     గని తనతేరు దోలుకొని గోవిందు నెయిదంబోయి యెలుంగెత్తి.133
క. ఓరిపశుపాలపుత్రక, దూరీకృతధర్మ పరవధూదూషక నా
     బారిఁ బడి తెందు వోయెదు, వీరుని నను రుక్మి నెఱుఁగవే వైదర్భున్.134
ఆ. ఉసుఱు గాచికొనఁగ నుల్లంబు గలిగిన, నిపుడ బాల విడిచి యేఁగు మట్లు
     గాక నిలిచితేని గ్రక్కున నిదె తల, గొను మదీయనిశితఘోరశరము.135
క. అని యతఁ [3]డఱువదిశరములు, వనజాక్షునిమీఁద నేయ వడి నాతఁడు నా
     తని నేసె డెబ్బదమ్ముల, ఘనమౌర్వీనినదభరితగగనుం డగుచున్.136
ఉ. కేతువు [4]ద్రుంచి చాపము నికృత్తముగా నొనరించి లీలమై
     సూతునికంఠముం దునిమి చోద్యపుటమ్ముల మేను నొంపఁగా
     నాతురుఁ డైనరుక్మిఁ గని యాతనిమిత్రులు దాక్షిణాత్యు ల
     త్యాతతవేగులై పొదివి రంతటిలోఁ జనుదెంచి మాధవున్.137
వ. ఆ రాజు లొక్కటఁ గూడి యేయు సాయకసహస్రంబులు సహస్రకరుండు తిమి
     రంబు విరియించుకరణి విరియించి విష్ణుండు వేణుధారిపడగ పుడమిం బడనేసి
     యంతట నిలువక తదీయదక్షిణభుజచ్ఛేదనంబు గావించి శ్రుతపర్వుం బటుబాణ
     పంచకంబున నొప్పించిన నతందు కేతుదండం బూఁతగా నొఱిగి యాలోనన
     తెలిసి యతనిపైఁ బెక్కువిశిఖంబులు పరఁగించె మఱియును.138

  1. దిక్కులు
  2. నతనివెనుక
  3. డుపదిశరంబులు
  4. గూల్చి