పుట:హరివంశము.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

285

చ. అనిమిషసిద్ధయక్షజగాదులు వేఁడినఁ బువ్వుఁబోఁడి నె
     వ్వనికిని నెట్ల గైకొనఁగ వచ్చు మదగ్రవిభూతి యల్ప మే
     యని తమకించి పేర్చెఁ బ్రభుఁ డంగనయుం బురుషోత్తమార్తయై
     యెనయు తలంపుజాడ కొక యింతయుఁ దక్కకయుండె వేడుకన్.9
తే. రుక్మి గోవిందుతోడి విరోధి గాన, యాతఁ డడిగినఁ జెలియలి నకని కీఁడ
     గొల్లపల్లియలో సందగోపునింటి, పసులగాపరి యగునె నాపాటి యనుచు.10
వ. ఆసమయంబున సుపరిచరవంశజాతుండును మగధమహీనాథుండును గిరవ్రజ
     పురస్వామియు నగుజరాసంధుండు నిజజ్ఞాతి యగు దమఘోషునకు వసుదేవు
     తోడంబుట్టు వైన శ్రుతశ్రవ యను నాయమకుఁ బుట్టిన దశగ్రీవశైబ్యదస్రస్వవశు
     లను నలువురు కొడుకులకుం బెద్దవాఁ డైన సునీధుం డను నామాంతరంబు
     గల శిశుపాలుం దజ్జనకుండు దనకుఁ గొడుకుగా నొసంగం గైకొనినవాఁడు
     గావున నతనికి రుక్మిణి నడుగఁ బుత్తెంచిన.11
తే. భీష్మకుఁడు వాసుదేవుపై బ్రియము గలిగి, యుండియును రుక్మి మాటకు నొండనంగ
     నేర కాచేదిపతికి నన్నీరజాక్షి, నిచ్చువాఁ డయ్యె మగధేంద్రు నిచ్చ గోరి.12
వ. ఆజరాసంధుండును సంబంధసంధి యవ్విధంబున సవిశేషంబుగా సంఘటితం
     బగుటకు సంతోషించి సకలబాంధవులకు శోభనార్థంబు లేఖలు [1]వ్రాయించి పుచ్చి
     రావించిన యంగ వంగ కళింగ పౌండ్ర పాండ్య కాశ [2]కరూశాద్యనేకదేశాధీశులం
     గూర్చి శిశుపాలుం దోడ్కొని తదీయస్నిద్ధు లగు పౌండ్రపుత్రుండును (వాసు
     దేవుండు) నేకలవ్యాత్మజుండు వీర్యవంతుండును దంతవక్త్రతనయుండు సువక్రుం
     డును లోనుగాఁ బెక్కండ్రు రాజకుమారు లక్కుమారుం బొదివికొనిరా ననే
     కాక్షోహిణీకలితంబు లగు బలంబులతోడ నడువ నప్రతిమవైభవంబున వైద
     ర్భునిపురంబునకుం జనుదెంచిన.13
మ. తన[3]చుట్టు న్నడుమన్ రథాశ్వగజబృందశ్రీ లెలర్పంగ నె
     మ్మన మానందము నొంద రుక్మి మగధక్ష్మానాథుఁ బ్రత్యుద్గమా
     ర్చనసంభావితుఁ జేసి తెచ్చి తగ విశ్వక్షోణిపాన్వీతు నా
     తనిఁ బ్రీతి న్విడియించెఁ బ్రస్ఫురితసత్కారోపకార్యావలిన్.14
వ. అమ్మహీపతి మౌహూర్తికుల రావించి లగ్నంబు నిర్ణయించి యెల్లి కుమారి
     వివాహలగ్నదివసం బని నిజస్కందావారంబున ఘోషణంబు సేయించె రాజు
     లెల్లం దమ తమ విభవంబులు మెఱసి సకలసేనల నలంకారంబు లొలయ సమక
     ట్టిరి శిశుపాలుండునుం బెండ్లిసింగారంబు పొలుపార సవయస్కులగు వసుధావర
     కుమారులం గలసి [4]యుల్లాసం బెసంగ నుండె నాసమయంబున నక్కడ.15

  1. పెట్టి
  2. కరూషా
  3. చుట్టు ల్నడవన్
  4. విలాసంబున