పుట:హరివంశము.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

హరివంశము

మ. బలధౌరేయతలందు నీకు సరి చెప్ప న్నీవ కా కెవ్వరుం
     గలరే యన్యులు గంధవాహ భువనఖ్యాతంబు నీవిక్రమం
     బలఘుస్ఫూర్తియుతుండ వట్లగుట నాయాజ్ఞ న్ముహూర్తంబులో
     వలయుం జేయఁగ నొక్కకర్జ మతులవ్యాప్తి ప్రదీప్తోద్ధతిన్.179
వ. అది యెయ్యది యంటేని.180
సీ. యాదవు లధికధర్మాచారధీరులు భూరివైభవు లు[1]పభోగరతులు
     కొలదివెట్టఁగ రానిబలగంబు గలవారు గావున వీర లొక్కట సుఖార్థ
     మంచితగోష్ఠీవిహారంబు గామించి యుండెడునప్పటి కొండు తెఱఁగు
     రచన లేవ్వయు[2]ను సురుచిరము ల్గా వద్రిఘాతికి నావిశ్వకర్మచేత
తే. నధికతపమున నిర్మిత యై సుధర్మ, యనఁగఁ బరఁగిన సభ నిర్జరాధినాథు
     ననుమతంబున నస్మదీయాజ్ఞఁ జేసి, యనఘ కొనివచ్చి యిమ్ము నెయ్యమున మాకు.181
ఉ. నా విని యట్ల కా కని మనం బలరం బవమానుఁ డఫ్టు
     వావలిపాలికిం జని బలానుజు పంపు బలాహితుండు సం
     భావన చేసి చేకొన సుపర్వులు నెమ్మది సమ్మతింప వే
     వే వసుధాతలంబునకు వేడుకఁ దెచ్చె సభానికేతమున్.182
వ. ఇట్లు తెచ్చి సుధర్మను ధార్మికపూజితుం డగుపయోజనాభున కిచ్చి సమీరుండు
     నిజేచ్ఛం జనియె నమ్మహాసభవలన యాదవు లాదిత్యసములును యాద
     వేంద్రుం డధరీకృతేంద్రుండును యదునివాసంబు సురావాసంబును నను
     [3]ప్రశంసనంబు సమర్థం బై యుండె మఱియు.183
మ. భువిఁ బాతాళమున న్దివిన్ జలధుల న్భూభృత్తుల న్వెండియున్
     వివిధస్థానముల న్శుభంబు లయి భావింపంగ నేమేమి వ
     స్తువిశేషంబులు దోఁచె నయ్యఖిలమున్ సొంపారఁ దెప్పించి మా
     ధవుఁ డర్థిం గయిసేయ నొప్పెఁ బురి కాంతాతుల్య యై యెంతయున్.184
వ. ఇట్లు నగరం బనన్యసామాన్యధన్యతావిభవంబు నొందించి బాంధవుల నసాధా
     రణకారణగౌరవోదారులం గావించి యీవిశ్వేశ్వరుండు మఱియుం బ్రకృతు
     లకును బౌరశ్రేణులకును సముచితంబుగా మర్యాదలు నిరూపించి బలాంగచతు
     ష్టయప్రవర్ధనోపాయంబు లుపపాదించి బలాధ్యక్షుల నిర్ణయించి.185
సీ. రా జుగ్రసేనుఁ డై రాజిల్లఁ దాను దీర్పరితనం బెంతయుఁ బ్రభుతతోడ
     నడపువాఁడయ్యె సన్మాన్యుఁ గాశ్యపుఁ డనువిప్రుఁ బురోధ గావించె మంత్రి
     వరు వికద్రుం డనువానిఁ బ్రతిష్ఠించె యదువంశవరుల నత్యధికమతుల
     నఖిలకార్యంబులయందుఁ బదుండ్రు వృద్ధుల నధికారదీప్తులుగ నునిచి

  1. సద్భోగ
  2. గావు రచిరంబుగా వృత్ర
  3. ప్రశంసనంబునకుఁ దగియుండె