పుట:హరివంశము.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

హరివంశము

వ. అట్లెల్లవా [1]రెల్లనుం జాల నెడగలిగి చూచుచుండ నంబరంబున ననిమిషసిద్ధవిద్యా
     ధరప్రముఖులును నధికతాత్పర్యంబున నాలోకింప సంగరరంగంబు ప్రవేశించి.62
సీ. పేర్చి మదోద్రిక్తబృంహితరౌద్రంబు లగుషష్టిహాయనహస్తు లనఁగ
     రోషభీషణరేఖ రొప్పుచు బీరంబు పొలివోనికడిఁదిబెబ్బులు లనంగ
     వెలయుదర్పంబున మలసి రంకెలు వైచి పటుకు గ్రాలెడువృషభంబు లనఁగఁ
     గ్రూరచేష్టితములఁ గూరి దుర్వారహుంకారంబు లగుమృగవైరు లనఁగ
తే. లాగువేగంబు సౌష్ఠవోల్లాసవిధము, గడఁకయునునుబ్బుఁ దుల్యత్వకరణి మెఱయ
     ఘోరమూర్తులై సింహనాదారవంబు, లడరఁ దార్కొని రవ్వీరు లాగ్రహమున.63
వ. ఇవ్విధంబునం దలపడి యిద్దఱు నుద్దామరభసంబునం బెనంగునెడ జరాసంధుండు
     సవ్యమండలభ్రమణంబున నభివేష్టింప ముష్టికాంతకుం డవ్వెరపు గణియింపక
     దక్షిణమండలభ్రమణంబుం జుట్టికొని తిరుగ నిరువుర కయిదువులు నొండొంటిం
     దాఁకి నిర్ఘాతపాతభీషణం జగు ఘోషంబు పుట్టింప బెట్టిదంబుగా బృహద్రథ
     సూనుపై నయ్యదునందనుండు గద వీచివై చిన నతం డప్పాటు దప్పించుకొనిన
     నది యుర్వీతలంబు సలియింపం బడిన నత్తెఱపి నుఱికి వ్రేసిన విపక్షువ్రేటు సైరించి
     ధీరుం డగు సీరాయుధుం డమ్మహాయుధంబు నతిరయంబునం బుచ్చికొని చెచ్చెర
     మాగధు నడిచిన నాతండును దీవ్రఘాతం బొనర్చె నట్లు దొడంగి యొకటి
     రెండు మూఁడు నాలు గే ననుచు నెక్కించిన ట్లక్కజంబుగా నొండొరులం బర్యా
     యప్రహారంబుల నొప్పింప నప్పటి చంక్రమణవేగం బలవడఁ బాదపీడిత యై సర్వం
     సహాయుఁ జలింపఁ బెంపేది కుండలికూర్మవిభులశిరంబులు వీఁపును నొగుల దిగులు
     పుట్టి దిగ్గజంబు లొరుగ నఖిలభువనవాసులు భువనంబులకు భద్రంబు గావుత మని
     భయభ్రాంతు లై యాక్రోశింప వాసుదేవాగ్రజుం గదిసి యహితుం డురస్థలం
     బతిగాఢప్రహతిం బగిల్చినం బెలుచ నెత్తురు గ్రక్కుచు గ్రక్కున నతండు పుడమిం
     బడి పడుటయు నెఱుంగంబడకయుండ నంతన యెగసి పగతు[2]నడితల బెడిదంపుఁ
     గడంక నడువఁ గర్ణనాసారంధ్రంబుల [3]మెదళులు దొరఁగఁ దూలి కూలినఁ
     బ్రతిభటుండు వొలిసె ననుచు యాదవు లార్వ గర్వం బేది మేదినీపతిసేనలు
     గలంగఁ గ్రమ్మరం దెలిసి మగధనాథుండు మాధవపూర్వజు నపూర్వహుంకారం
     బున నందంద వ్రేయుటయు నమ్మహాబాహుండు సముత్సాహంబునఁ బ్రతికృతి
     గావించె వార లన్యోన్యహననంబులం బ్రశతాఖిలకాయు లై రుధిరధారలం
     దడిసి పుష్పితకింశుకంబులుంబోలెఁ బొలుపారి గగనచారులచూడికిం బరమో
     త్సవం బాపాదించిరి తదనంతరంబ.64

  1. రెల్ల జాడల
  2. నడుతల
  3. మెదడులు