పుట:హరివంశము.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

267

వ. అట్టి సంకులసమరంబును గులశక్తిసాహసంబులు నిరపోహంబులుగా నిర్వహించు
     గర్వంబునం బెంపారు శూరులు గవిసి చిత్రసంప్రహారప్రౌఢి సూప నేపునం బోవక
     పెనంగు తురంగమాతంగశతాంగపదాతివ్రాతంబుల వివిధనిపాతనంబులం బగిలిన
     మోరల నొగిలిన కంధరంబులం దునిసిన తొండంబుల ముఱిసిన కొమ్ముల నొఱగిన
     సారథుల విఱిసిన కేతువులఁ ద్రెస్సిన నడుముల వ్రస్సిన యురంబులం బ్రచురం బై
     చెల్లం దోడ్తోన పెరుఁగు పెన్నెత్తురు మడువులు గాలువలు నై యొదవి యస్థి
     చూర్ణసైకతంబుల బలలపంకంబులం బరఁగ మరలిన హారమణులం బడిన [1]తెల్ల
     గొడుగుల సమరభూభాగంబు లుద్భిన్నతారకంబులు నుల్లసితశశాంకంబులు నగు
     నాకాశప్రదేశంబుల ననుకరింప నాయతబాహుచ్ఛేదంబులు నారక్తకరచరణం
     బులుం గలచోట్లు ప్రసుప్తభుజగంబులు ప్రస్ఫురితకోకనదంబులు నగు నెలవుల
     చెలువు దీపింప నిర్జీవతానిశ్శబ్దంబు లగు శరీరసహస్రంబు లెడనెడం బడిన వీర
     శంఖ పణవ దుందుభి కాంస్యకాహళాదులును సమానవ్యసనంబు లయి [2]మూకీ
     భవించె నన నడంగి యుండ నొండొండ పేర్చు భూతబేతాళడాకినీశాకినీకల
     కలంబులవలనం గేవలకుణపమయంబు లగు ఠావులం బునరుజ్జీవితదేహంబు లైన
     పగిది నుత్ప్రేక్షణీయంబు లై వెలయ వియత్తలరంగంబు గైకొని కుంచియ వీచి
     యాడునారదుచేత శిక్షితంబు లయ్యె ననం దగి గృహీతప్రహరణంబు లయి
     నర్తించు కబంధంబులు రౌద్రాద్భుతరసంబులకుఁ బాత్రంబు లై మెఱయ నవ్వేళ
     యాభీల యయ్యె [3]నాసమయంబున.57

బలరామ జరాసంధుల గదాయుద్ధ విజృంభణము

మ. తనతే రెందును నుల్లసిల్లఁగ బలోద్దాముండు రాముండు దీ
     ప్తనిశాతాస్త్రపరంపర న్మగధయోధశ్రేణిఁ దూలించుచుం
     జనుదేరం గని సైప కేపున జరాసంధుండు సంధుక్షితో
     గ్రనిజక్రోధకృశాను నాతనికి వీఁకం జూపఁ గాంక్షింపుచున్.58
క. తే రభిముఖంబు సేయఁగ, సారథిఁ బనిచి పటుబాణజాలభయదవీ
     రారంభుఁ డైనఁ దత్క్రియ, చీరికిఁ గైకొనక తాఁకె సీరియుఁ గడిమిన్.59
చ. ఇరువురు [4]నేచి తుల్యముగ నెంతయుఁ బ్రొద్దు పెనంగి రథ్యముల్
     ధరఁ బడ సూతు లీల్గఁగఁ బతాకలు మ్రొగ్గఁగ వర్మబంధముల్
     మురియఁగఁ జాపము ల్దునియ ముద్గరతోమరశక్తు లాదిగా
     వరుస ననేకము ల్మడియ వావిరిఁ బోరి చలంబు పెంపునన్.60
తే. గదలు గొని మహితలముగ్రక్కదలనుఱికి, తుంగశృంగసమన్వితాద్రులునుబోలెఁ
     గదియ రెండుసైన్యములును గదన ముడిగె, నమ్మహాద్వంద్వయుద్ధవీక్షాదరమున.61

  1. వెలి
  2. మూర్తీభవించె ననందగి
  3. సమ్ముఖంబున
  4. నొక్కబీరమున; నొక్కరూపమున.