పుట:హరివంశము.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

265

     నుగ్రసేనుండు భీష్మకుని వసుదేవుండు క్రధుని బభ్రుండు కౌశికుని గదుండు చేది
     నాథుని రంభుండు దంతవక్త్రుని సాత్యకి విందానువిందులను శతద్యుమ్నుం డేక
     లవ్యుం దాఁకిరి జరాసంధుండు రామునితో సంగ్రామం బొనర్చు నాసమయంబున.42

రుక్మి శ్రీకృష్ణునితోడం దలపడి యుద్ధంబు చేసి పరాజితుం డై పోవుట

తే. ఇరువదేను ముప్పదిరెండు వరుసతోడ, నేసె నమ్ములు రుక్మిపై వాసుదేవుఁ
     డస్త్రములు రెంట భోజరాజాత్మజుండు, మాధవుని నేసె వేఱొక్క మార్గణమున.43
క. ఆతని కార్ముకమౌర్వీ, నాతనమున కుత్సహింప శార్ఙ్గధరుండున్
     శాతాంబకమున విశిఖో, పేతంబుగఁ ద్రుంచె నతని పెనువెల్లు వెసన్.44
ఉ. ఛిన్నధనుష్కుఁ డై రిపుడు శీఘ్రమ శక్తి యమర్చి వైచె నా
     వెన్నునిదిక్కు శౌరియును విస్ఫుటభల్ల మొకంట దాని ను
     త్సన్నము సేసి యోలిన గదాపరిఘంబులు లోనుగా నతం
     డెన్నిటి నెత్తె నన్నియును నేపెసఁగ న్నుఱుమాడెఁ గైదువుల్.45
వ. అంత నిలువక కేతనంబు నఱకి రథ్యంబుల వధియించి సారథిం దెగటార్చి విర
     థుండును వికలసాధనుండు నైన యతనిం జూచి త్రికాలవేది యగుట నవ్విష్ణుండు
     భావి యగుతత్సోదరీపరిగ్రహంబున నయ్యెడు యదుబాంధవం బూహించి చంపక
     పోవిడిచె నుగ్రసేనుండు భీష్మకునిం బంచవింశతివిశిఖంబుల నేసిన నతం డతని
     ననేకశతసంఖ్యంబు లగు శరంబులం బొదువుటయు.46
ఆ. అలిగి కంసుతండ్రి యతని విల్లును బడ, గయును ద్రుంచి సూతు హయచయంబుఁ
     గూల్చుటయును భీతిగూరి భీష్మకుఁడు [1]క, య్యంబు సేయు టుడిగి యరిగెఁ దొలఁగి.47
మ. క్రథుఁ డేడమ్ముల నొంచెఁ గృష్ణజనకున్ గర్వంబుతో నాతఁ డా
     పృథుబాణాహతి లెక్కసేయక వడిం బెల్లేసి తోడ్తోన సా
     రథి నశ్వంబులఁ గేతువున్ ధనువు రౌద్రస్ఫూర్తితోఁ ద్రుంపఁగాఁ
     బృథివీనాథులు సూడఁ బాఱె నతఁడు భీతిం గడున్ దవ్వుగన్.48
వ. బభ్రుం డనేకబాణంబులం గౌశికునంగంబు నొప్పించిన నయ్యదువీరుని నాతండు
     సాంద్రశరవృష్టిం దొప్ప [2]దోఁచుటయు నమ్మహాబాహుండు తద్బాణాసనంబు
     నఱికిన నొండువి ల్లెత్తి యేయుసాయకంబులు మర్మంబులు దాఁకి నొచ్చిన
     [3]నొవ్వుతోన యలుక నురవణించి.49
క. పరుష మగునర్ధశశిముఖ, శరమునఁ బగతునిశిరంబు చారుకిరీట
     స్ఫురితమణిరుచులు పర్వఁగ, ధరణికి బలిగా నొనర్చి తడఁబడ నార్చెన్.50

  1. కయ్యంపునేల విడిచి
  2. దోఁగుటయు
  3. నొప్పుతోన యలుక యొసంగిన