పుట:హరివంశము.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 1.

259

     నందముఁ బొంది యాదవులు నవ్యనిరూఢి నలంకృతాంగు లై
     ముందట నుగ్రసేను నిడి ముఖ్యపురోహితకపూర్వకంబుగన్.178
వ. అనేకదంతితురంగసుభటసహస్రంబుల సమకట్టి యుదగ్రకేతువులు నుజ్జ్వలాత
     పత్రంబులు నొక్కట శోభిల్లం బెల్లుగా మ్రోయుచు మంగళవాదిత్రంబులతో
     నమిత్రజైత్రు లగు నవ్వసుదేవపుత్రుల నెదుర్కొని వారును వారి నభినందించి
     వందిమాగధకీర్తనంబులు విప్రజనాశీర్వాదంబులుం బ్రకృతిప్రమోదవాక్యం
     బులు వీనులకు నింపుసొంపు సంపాదించ నకంపితవిభవంబునం బురంబు ప్రవేశించి
     రా సమయంబున.179
చ. అనిమిషకోటి గొల్వఁ బొలుపారు[1]పురందరుఁ బోలి యాదవుల్
     దనుఁ గొలుపంగఁ గృష్ణుఁడు ముదం బెసఁగన్ వసుదేవు నింటికిం
     జనుటయు నన్నతో నటులు సమ్యగుపాగతుఁ డైన కూర్మినం
     దనుఁ బ్రణతోత్తమాంగుఁ వగఁ దండ్రి కవుంగిటఁ జేర్చి యర్మిలిన్.180
వ. వేనవేలు దీవన లిచ్చి వేయివిధంబుల నుపలాలించె నమ్మహోత్సవంబున నప్పురంబు
     లోన నెవ్వండును దీనుండు మలినుండు ననలంకృతుం డసంతుష్టుం డనుత్సా
     హుండును లేఁడు సర్వజనంబులు బరమకల్యాణభరితు లయి రని వైశంపాయ
     నుండు చెప్పినకథ సవి పరంబుగ.181
ఉ. వాసవితుల్యవిక్రమ[2]వివాసితశత్రుభుజావిలాస ది
     గ్వాసనకారిసౌరభ [3]విభాసియశస్కర దానవిభ్రమో
     ద్భాసికరాబ్జభాసురవిభాసరసీరుహమిత్ర మానసా
     ధ్యాసిదయాసనాథతుహినాంశువిభూషణ సౌమ్యభూషణా.182
క. శ్రీమల్లచమూవల్లభ, సామాదికచతురుపాయసామర్థ్య నమ
     త్సామంతోజ్జ్వలవైభవ, సామగ్రీలబ్ధఫలసౌభ్రాత్రసుఖా.183
మాలిని. వినుతభువనవీతోద్వేగవిస్తీర్ణభాగా, వినరభరితవిశ్వావేక్ష్య[4]విద్వత్ప్రతీక్ష్యా
     ధనదసదృశదానోదాత్తదాక్షిణ్యచిత్తా, ధనికసుజనధర్మాధ్యక్షధన్యస్వపక్షా.184
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యనారాయణసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయ
     నామధేయప్రణీతం బైన హరివంశంబు నుత్తరభాగంబునందుఁ బ్రథమా
     శ్వాసము.

  1. షడానను
  2. నివారిత
  3. విశాసి
  4. విద్యాప్రతీక్ష్యా