పుట:హరివంశము.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

హరివంశము

     రక్కట చన్నె యిట్లు వసుధాధిపులార పదప్రచారతం
     దక్కొని యున్నమ మ్మిచటఁ దార్కొనలేక తొలంగి తూలఁగన్.112
మ. [1]అనికిం దారికి తోడు తెచ్చుకొని మి మ్మడ్డంబుగా నొడ్డుచుం
     దన మై సోఁకక యుండఁగాఁ దిరిగెడున్ దవ్వై జరాసంధుఁ డి
     ట్లనిమిత్తంబు నశింప నేమిటికి మీ కారాజు నాత్తాపరా
     ధునిఁ బుత్తెం డిట నస్మదీయ[2]సుమహద్దోశ్శిక్ష లక్ష్యంబుగన్.113

జరాసంధుఁడు బలదేవవాసుదేవులతోడ యుద్ధంబు సేయుట

క. అని పలికెడు పల్కులు విని, మనమునఁ గిను కొదవ నుదరి మగధ విభుఁడు జో
     డునువిల్లు దేరు ఘనకే, తనమును గొని కడఁగె శార్ఙ్గధరుపై నొకఁడున్.114
వ. కడంగి యతండు నతనిం గని.115
శా. ఏ నుండంగ నరేంద్రసింహముల నీ వి ట్లేల సెగ్గించె ది
     చ్చో నుగ్రాటవిలోన నాఁ డటు పశుస్తోమంబులం గాచిన
     ట్లౌనే కేశవ లావుఁ జేవయును ధైర్యంబుం గలం డండ్రు ని
     న్నానేర్పిప్పుడు నాకు నెక్కినఁ గదా యత్యంతసిద్ధంబగున్.116
చ. అనితల నిట్టు [3]లగ్గలము లాడినయట్టులు గాదు సేఁత చొ
     ప్పనయము వ్రేఁ గొకింతపడి యాత్మఁ దిరంబుగ సైచి నిల్వుమా
     సునిశితమామకాస్త్రములసోన మునింగి పరేతభర్తతో
     నొనరఁగ నేఁడ చేసేద వనుత్తమసఖ్యవిశేషభద్రముల్.117
తే. అనినఁ జిఱునవ్వుతోడి యనాదరావ, లోకనము రక్తనేత్రాంకభీకరముగఁ
     గంసమథనుఁడు మగధభూకాంతుతోడ, నిట్టు లను ధరణీశ్వరు లెల్ల వినఁగ.118
క. నాలా వెఱిఁగెడునంతటి, [4]చాలిక నీ కొదవె నేని జనవర కడు మే
     లేలా తడయఁగ [5]నిదె నీ, యాలోకనగోచరుండ నై యున్నాఁడన్.119
తే. రిత్తమాటలు [6]సెల్లవ యుత్తము లగు, శూరులకు రజ్జు లొప్పునె సారబాహు
     లీల నెఱుపుట దక్కఁగ లెమ్ము కడిమి, సూపు వివిధాస్త్రశస్త్రవిస్ఫూర్తి యెసఁగ.120
వ. అని యాక్షణంబ యా జగదేకవీరుం డా రాజకుంజరు నెనిమిదియమ్ముల
     నొప్పించి సారథి నైదుబాణంబులను రథ్యంబుల ననేకబాణంబులను నొప్పించె
     ముసలాయుథుండు బాణాసనప్రౌఢి మోఱయ నతనివిల్లు నడిమికి నజ ఱకె నిట్లు
     కృచ్ఛ్రగతుం డైన యేలికం గని సేనాపతు లగు కౌశికచిత్రసేనులు రయంబున
     నడరి.121
క. బలదేవు మూఁడుశరముల, నలఘువిశిఖపంచకమున నబ్జాక్షుని న
     గ్గలిక యెసఁగ నేసి వియ, త్తల మద్రువఁగ నార్చుటయును దద్దయు నలుకన్.122

  1. అనికంబోరచి. (బ్రౌన్)
  2. సుమహాదోశ్శిక్ష
  3. లగ్గమయి యాడిన
  4. చాలుట
  5. నే నిదె
  6. సెలవులే దుత్తములగు