పుట:హరివంశము.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 1.

251

క. గోపాలురు వీ రిరువురు, భూపాలురు పలువు రుగ్రభూతరబలా
     టోపసమగ్రులు మీ రీ, చాపలమున కోర్చి యొదుఁగఁజనునే [1]యిచటన్.107
ఉ. ఇంచుక నెమ్మనమ్ముల సహించి రణమ్మున [2]నిల్చి నన్ను వీ
     క్షించుచు నుండుఁ డేమియును గీడును బొందఁగ నేను మిమ్ము
     క్రించుల యాదవాన్వయులఁ గేలియపోలె ధనుర్విముక్తని
     ర్వంచితసాయకాగ్ని కనవద్యహవిస్సులు గా నొనర్చెదన్.108
వ. అనినం గలంక దేఱి యందఱుఁ గ్రమ్మఱ నుత్సాహంబు పాటించి
     మూఁకలం బ్రయత్నంబునం బురికొల్పి యాత్మీయంబు లగు వాహనశస్త్రాదుల
     నాయితంబుగా సమకట్టి కేతుచ్ఛత్రచామరప్రముఖలక్షణంబులు మెఱయ
     భేరీపణవాదివాదిత్రంబులమ్రోఁతతో బెరసి గజబ్బంహితంబులు రథనేమి నిర్ఘో
     షంబులుం దురంగహేషితంబులు భటసింహనాదంబులు రోదసీభేదనప్రచండంబు
     లుగా నుద్దండరభసంబున బలదేవవాసుదేవులం బొదివి.109
క. శరచక్రతోమరంబులు, [3]గురిసియుఁ గరవాలపరశుకుంతాదుల న
     చ్చెరువుగ వ్రేసియుఁ బొడిచియు, నరనాథులు ఘోరరణ మొనర్చిరి కడిమిన్.110
వ. అట్టి కోల్తల సైరించి కులగిరులపోలికి నప్రకంపు లై నిలిచి యదువీరులు దారుణ
     సంరంభంబునఁ గోపప్రతాపంబులు సూపి దీపించిన భూపసైన్యంబులయందు
     ముసలవిచ్ఛిన్నకుంభంబులు సీరదారితవంక్షణంబులు నై తూలుశుండాలంబులును,
     చక్ర[4]నికృత్తకంధరంబులుఁ గృపాణదళితదేహంబులు నై పొలియు హయంబు
     లును, నిపాతితరథికంబులు హతసారథికంబులు నై తెరలి పాఱుతేరులును,
     సాయకహతశరీరులు హుంకారస్ఫారస్ఫుటితమానసులు నై సొలయు పదాతులు
     నగుచుఁ బ్రత్యర్థిబలంబు కష్టదశం బొందం గీలాలజలాశయంబులం బలలకూట
     కృత్రిమాద్రుల మేదోనిచయతల్పంబుల నుజ్జ్వలాంత్రహారంబుల నాయత
     స్నాయుమేఖలలఁ గీకసవలయకంకణంబులఁ గపాలచషకంబుల గాత్రచ్ఛేదోప
     దంశంబుల మజ్జామదిరాపూరంబులఁ గంకాళవీణలఁ గబంధనటనంబుల గోమాయు
     విరుతగానంబుల నాజిరంగంబు జమునివిహారదేశంబును మండనస్థానంబు నాపాన
     భూమియు సంగీతస్థలంబును నను శంక నుత్పాదించుచుఁ గంకగృధ్రకలకలంబుల
     భూతబేతాళడాకినీవిహరణంబుల నతిరౌద్రం బయ్యె నిట్లు శాత్రవసహస్రంబులం
     బరిమార్చి నలుదెసల నొదుఁగురాజులం గనుంగొని కమలనాభుం డెలుంగెత్తి
     వారి కి ట్లనియె.111
ఉ. ఎక్కుడుఁ బేర్మి వాహనము లెక్కినవారు బలంబు పెక్కువం
     బెక్కురణంబులం గడిఁదిబీరము చూపఁగఁజాలువారు మీ

  1. మీకున్
  2. నన్ను మీరు
  3. గురియుచు
  4. నికృంత