పుట:హరివంశము.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 1.

245

మ. మధుమాసంబునఁ గేసరస్తబకసమ్యఙ్మాధవీమంజరీ
     మధునిష్యందము లాత్మగాఁ బరఁగి రమ్యం బైనమేఘాగమా
     వధి నుత్ఫుల్లకదంబగుచ్ఛతతు [1]లావాసంబుగాఁ బేర్చి స
     న్మధురామోదవికాసినై సరసతామౌగ్ధ్యంబునం గ్రాలుదున్.63
తే. తొంటిసంగతి దలఁచి నీతోడనాడు, [2]వేడ్క సుర్వితలంబున వెదకి వెదకి
     యిప్పుడు తృషనొంది యున్నని న్నెఱిఁగి కాంచి, నా తెఱం గెల్లఁ జెప్పితిఁ బ్రీతి నధిప.64
క. ననుఁ గైకొని నేఁ డాదిగ, ననురాగముతో సుఖింపు మటుగాకయు నొం
     డని త్రోచితేని విరహం, బున కేమియు నోర్వ నేను భూరివివేకా.65
వ. అనియె ననంతరంబ మఱియు నొక్క మానిని యమ్మహామనస్కునకుం బొడ
     సూపి వినతాంగి యై నిలిచి.66
మ. విను మేఁ గాంతి యనంగఁ జంద్రునికడన్ విఖ్యాతనై యుండుదున్
     నిను నాశీతమయూఖుకంటె ఘనుఁగా నిక్కంపు[3]జూ పొప్పఁగాఁ
     గని ప్రేమంబునఁ బొంద వచ్చితిఁ దగం గైకొమ్ము లోకాతిశా
     యిని నీయుజ్జ్వలమూర్తి నీకు నెనయే యెన్నంగ నేమూర్తులున్.67
క. అని పలుకఁగ వేఱొకకా, మిని గ్రక్కునఁ [4]దోఁచి కేల మిక్కిలికాంతిం
     దనరువనజదామం బా, యనయఱుత నమర్చి విరచితాంజలి యగుచున్.68
వ. దేవా యేను రత్నాకరతనూభవ నైన లక్ష్మిని నే నిప్పుడు సాక్షాత్పుండరీకాక్ష
     మూర్తి వైన నీపరిగ్రహం బపేక్షించి వచ్చితిం గారుణ్యంబున నన్ను ననుగ్ర
     హింపుము.69
సీ. బాలార్కమండలపరిభాసి యైనది యిదె రత్నమయసముదీర్ణమకుట
     ముజ్జ్వలవజ్రసమున్నతి నెంతయుఁ గొమరైనయవి మణికుండలములు
     కమనీయనీలతాకలితంబు లైనవి యివె నూత్నేకౌశేయకవసనములు
     ధవళమౌక్తికశోణతరళశోభిత యైనయది యిదె విస్ఫారహారయష్టి
తే. యబ్ధిజాతంబు లిన్నియు నాదియందు, ననఘ నీసొమ్ము లిప్పు డింపారువేడ్క
     నోలిఁ గైసేయవలసినవేళ గాన, యాచరించి భజింపు మత్ప్రార్థనమున.70
క. అన విని బలదేవుం డ, వ్వినుతద్రవ్యంబు లెల్ల వేర్వేఱ ప్రియం
     బునఁ గైకొని యమ్మువ్వురు, వనితలు దనమూర్తిఁ జెంది వశమున నిలువన్.71
వ. అత్యంతశోభాసమధికుం డై యాక్షణంబ కదలి కమలాక్షుపాలికిం జనియె
     నాసమయంబున.72
సీ. [5]అంభోధితో సుప్తుఁ డైననారాయణుదివ్యకిరీటంబు దితిజుఁ డొకఁడు
     వైరోచనుం డనువాఁ డెత్తుకొని[6]పోవఁ జొప్పునఁ జని మహాశూరవరుఁడు

  1. లన్ వాసంబుగా
  2. వేడుకను నుర్వితలమున
  3. బెంపొప్పఁగా
  4. దోఁచెఁ గెలన
  5. అంబుధిలో
  6. పోవుచెప్పున