పుట:హరివంశము.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

హరివంశము

     ద్రావను డిగ్గఁద్రోవను మతం బొకఁ డేర్పఱుపంగనేరమిం
     దావకపూర్వవంశసముదాయ మెలర్పక యున్నె [1]నివ్వెఱన్.37
తే. మాతృ[2]కంధరాదళనసమర్థ మైన, పరశు వఖిలపార్థివవంశపాటనమునఁ
     బరఁగె నేమని[3]యెద నీప్రభావగరిమ, రైణుకేయ యౌదార్యసంగ్రహవిధేయ.38
వ. ఏము యమునానదీతీరగోచర యగు మధుర యను పురి నివాసంబుగా నుండు
     దుము యదువంశతిలకం బగు వసుదేవుపుత్రులము బలదేవవాసుదేవనామధేయు
     లము కంసభయంబున మాతండ్రి మముం బుట్టినయప్పుడ గోపకులంబునం బెంపం
     బెట్టనం బెరిఁగి చిక్కనివారమై [4]కంసునిం దునిమి తదీయరాజ్యం బతని జనకు
     నక యిచ్చితిమి కంసుం జంపినకతంబున జరాసంధుండు మామీఁద ననేక
     సైన్యంబులం గూర్చి యెత్తివచ్చినవాఁ డతం డెరుంగం బురంబు వెలువడి
     యకృతాస్త్రులము గావున నతని కెదుర [5]నలవిగాక చులుకనఁ గాల్నడ నింతదూ
     రంబు వచ్చితిమి మా కెయ్యది కర్తవ్యంబు వాఙ్మాత్రంబున నీకుం జేయ సుకరంబు
     నిన్నుఁ జేరితి మనుగ్రహించి పంపు మనిన నాభృగువంశ[6]వర్యుం డయ్యదు
     కులోత్తమున కి ట్లనియె.39
ఉ. కారణమానుషత్వమునఁ గంసుఁడు లోనుగ దుష్టదైత్యులం
     టే రడఁగించుపొంటె నిటు పృథ్వి జనించినవాని నాదిపం
     కేరుహనాథుఁగా నెఱిఁగి కృష్ణ యజస్రము నిన్నుఁ జూడఁగాఁ
     గోరుదు నేఁడు నాకు సమకూరె మనోరథసిద్ధి యంతయున్.40
క. వినుము జరాసంధుకతం, బున నిప్పుడు మీకు నైన పోరామియు మీ
     రనఘా యిట రాకయు మదిఁ, గని వచ్చితిఁ జూవె మేలు [7]గావించుటకున్.41
వ. భవదీయం బగు దక్షిణాపథయానం బెఱుంగుం గావునఁ బ్రత్యర్థియు మీవచ్చిన
     తెరువునన సర్వసహాయసమేతుం డై యేతెంచుఁ గయ్యం బవశ్యంబునుం గలుగు
     సృగాలవాసుదేవుం డనియెడువాని యేలెడుభూమి కరవీరపురం బనం దదీయ
     నివాసం బనతిదూరంబు మీ రియ్యెడ నుండవలవదు జరాసంధు జయింప నను వైన
     దుర్గం బొక్కటి గలదు మీకు నది యంతయుం జూపి మిమ్ము నచట నుంచి
     వచ్చెద నిది దత్ప్రకారంబు వినుఁడు.42
సీ. వేణ్యాభిధాన యై వెలసిన యిమ్మహా[8]తటిని యీరేవునం దాఁటిపోయి
     క్రూరకర్ములు మహాచోరులు, చక్రగిరి చూచి యొకవిభావరి ప్రియమున
     నచ్చోట వసియించి యవల ఖడ్గగ యను నేటితీరమున సమిధ్ధతపము
     గావించ మునుల నిష్కాముల దర్శించి యలక్రౌంచపురి గని యందుఁ జొరక
తే. యానరుహ మనుతీర్థమ్మునందు విడిసి, రేప కొంతద వ్వరిగి యుద్దీపితాగ్ర
     మైనగోమంత మనుశైల మనఘ కాంతు, మది మహాదుర్గ మేకశృంగాన్వితంబు.43

  1. నెవ్వెఱన్
  2. కంధర
  3. పొగడ నీప్రాభవంబు
  4. కంసుం బుచ్చివైచి
  5. నలంగి; నలికి
  6. వరేణ్యుం
  7. గావింపంగన్
  8. నదిని