పుట:హరివంశము.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము ఆ. 1.

241

సీ. అడవి యెల్లను దాన యైనది యన నమేయము లగు సంప్రరోహములు గలిగి
     యాకు లెల్లను దాన యైనది యన నెందుఁ బరఁగిన బహువిటపములు గలిగి
     యవని యెల్లను దాన యైనది యనఁ దన నీడ నొప్పారెడు నెలవు గలిగి
     యభ్ర మెల్లను దాన యైనది యన బహుపక్షిసంశ్రయ మైన పఱపు గలిగి
తే. పక్వఫలసాంద్రవర్ణసంపన్నిరంత, రంబు నిర్మేఘసురధనుర్వైభవంబుఁ
     జూపుచును నద్భుతోదయస్ఫురితమహిమఁ, దనరు నొక్కమహావటతరువుఁ గాంచి.33

శ్రీకృష్ణబలరాములు పరశురామునిం గని తమరాక యెఱింగించుట

వ. వివిధసంస్కారశోభితం బగు తదీయస్థలంబున ననేకద్రవ్యంబుల జంద్రార్ధశేఖరు
     నంబికానాథు నాదిదేవుం ద్రిలోచను నర్చించుచుఁ దదాసక్తచిత్తుం డై బహు
     పరిజనంబులు మనోజ్ఞవస్తువులం బరమబ్రాహ్మణసముదయంబుల కభిమతా
     హారంబు సంఘటింప నొక్కదెసం గట్టిన సవత్సయగు సుపుష్టహోమధేనువుం
     బార్శ్వంబులం బొలుపారు స్రుక్స్రువారణికమండలువులు నిత్యసత్కృతుల
     వెలుంగు హుతహుతాశనుండును నంతికస్థలంబుల మహాధనుస్తూణీరకృపాణ
     పరశ్వథాద్యాయుధంబులును నద్భుతంబు లై బెరసి బ్రహ్మక్షత్రమయం బగు
     తేజంబు దెలుప నుదయార్కబింబసుందరదేహుం డగు తనకు వికీర్ణకపిలజటా
     వళులు ప్రత్యగ్రమరీచు లయి రుచియింప జపావసానంబునం గర్ణావసక్తం
     బయిన యక్షుసూత్రంబును లలాటలసితంబు లగు భసితత్రిపుండ్రలిఖితంబులుం
     జంద్రాంశునిర్మలంబులగు యజ్ఞోపవీతంబులు నున్నతాంసగ్రథితం బగు మృగా
     జినోత్తరీయంబును ననవరతనియమకృశం బగు శరీరంబు భూషింపఁ గుశబ్రుసీ
     రూపం బగు దీపికాసనంబున నాసీనుం డై యున్న జామదగ్న్యమహాముని
     నంతంత నాలోకించి యయ్యిద్దఱు నాశ్చర్యభరితమానసు లగుచుఁ జేర నరిగి
     తదీయచరణంబులు దమశిరంబులు సోఁకం బ్రణామంబు లాచరించి కృష్ణుండు
     ప్రాంజలి యై యతని కి ట్లనియె.34
మ. [1]తగువిద్వద్గుణరూపశోభితునిఁ గా ధన్యంబు లై యెవ్వనిం
     బొగడున్ లోకము లట్టి సంయమికులాంభోరాశిపూర్ణేందునిన్
     నిగమైకేశ్వరు నే మెఱింగితిమి నిన్ శ్రీజామదగ్న్యుండుగా
     నగణీయంబులు నీప్రభావములు భవ్యంబుల్ సుధీసేవ్యముల్.35
క. అమ్ము మొన నబ్ధితరఁగలు, రమ్మన నెడగలుగఁ ద్రోచి [2]కాదే యిలుప
     ట్టిమ్ములఁ బడసితి యీస, హ్యమ్మునఁ బశ్చిమధరిత్రి యపరాంతమునన్.36
ఉ. పావనవిక్రమోదయవిభాసితశీలఁ గృతార్థబుద్ధివై
     నీ వొసఁగంగ సర్వధరణీవరర క్తజలోజ్జ్వలాంజలుల్

  1. తగ నిర్నిర్గుణ; తగ నిన్నుం గుణ.
  2. ఘనమై యీప