పుట:హరివంశము.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

229

     జల మె త్తి గోకులసంభూత మగుకృష్ణవీరపింహముఁ దెచ్చి విడిచె నీకు
     జేష్టింప లేవైతి చిక్కితి మడిసితి నీపోక లరిది వర్ణింప నధిప
తే. యార్తకరిణీసమాన[1]దురంతదశకు, భోజనంబుల మైతిమి రాజ మమ్ము
     నరయఁదగదె నీమన్నన యకట యెందు, పోయేఁ జెప్పలేవైతివి పోవునపుడు.155

కంసభార్యలు మృతుండయిన పెనిమిటిం బేర్కొని విలాపంబు సేయుట

క. మామీద నీమనంబునఁ, బ్రేమము లేకుండుఁగాక ప్రియబాంధవమి
     త్రామాత్యులు లేరే వా, రేమి [2]గొఱఁతచేసి రెడసి యేఁగితి దివికిన్.156
తే. చిదిమి వై చిననెత్తమ్మిఁ జెనసి వాడి, వందినది నీముఖంబు వివర్ణతార
     కంబులై యొప్పు సెడినవి కన్ను లిట్టి్, శూన్యభావ మే మెమ్మెయిఁ జూతు మనఘ.157
ఉ. ఆరమణీయకుండలము లక్కట యెక్కడఁ బోయె నెంతయున్
     గారవ మేది కర్ణములు గండతలంబుల నంటికొన్న వా
     చారుకిరీట మె ట్లొఱగి స్రగ్గె నరేంద్రత లేదె నీకు నా
     భూరిభుజాంతరాభరణము ల్దెగి యిమ్మెయి ధూళి బ్రుంగెనే.158
మ. దివిజానీకముతోడఁ గూడ ననిలో దేవాధిపున్ విక్రమ
     వ్యవహారంబునకుం దొలంగ నిడి తా వార్ధీశుగేహంబునం
     దు వెలుంగొందుసమస్తవస్తుమణిసందోహంబుఁ జూరాడి తిం
     తవెసం గూల్చెనె మర్త్యుఁ డొక్కరుఁ డమర్త్యప్రాయు నిన్నుం దుదిన్.159
ఉ. వాసవుఁ డల్గి నీభువికి వర్షము మాన్చిన నీవు నవ్వి బా
     ణాసనముక్తదివ్యవిశిఖావలి నంబుదకోటి వ్రచ్చి ధా
     రాసలిలప్లవం బఖిలరంజకమై యొలయంగఁ జేయవే
     నీసరి యెవ్వఁ డిప్టు విధి నిర్దయుఁ డైన వశంబె యెద్దియున్.160
తే. నేలనాలుగుచెఱఁగుల నృపులు నీకు, నధికనమ్రులై తమసొమ్ము లంతవట్టు
     నిచ్చి బ్రతికిరి నీశౌర్య మేల యిట్లు, గోపబాలుని చేఁ జిక్కె భూపసింహ.161
ఉ. చాలెడువాఁడ వెన్నఁడును జావునుఁ జేటును బొంద వంచు నీ
     ప్రాలకుఁ దోయిలొగ్గు టది భాగ్యఫలంబుగ నేము నమ్మి సౌ
     ఖ్యాలసలీల నుండ నది యంతయు బొంకుగఁ జేసి తాండ్రనున్
     వాలినపేర్మి యేది విధవాదశఁ బొందఁగఁ జేఁత పాడియే.162
క. సురపురి మధురకు నెక్కుడె, సురకాంతలు మాకు దొరయె సురభంజన నీ
     వరుగుట యొప్పనిపని వే, మరలుము మామాట వినుము మముఁ గావఁదగున్.163
తే. అకట మీతల్లి ముదుసలి యగ్గలముగఁ, గలదు నీమీఁద నర్మిలి యలఘుచరిత
     యింక నీయమయలమట కేది గుఱుతు, గురుజనప్రీతి సేయమి గుణమె నీకు.164

  1. దుష్కీర్తు
  2. గొఱంత చేసి రీడితవిధికిన్