పుట:హరివంశము.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

హరివంశము

తే. నోర ముక్కునఁ జెవులను ఘోరరుధిర, మొలుక గ్రుడ్డులు వెలుపలి కుఱుక మేడ
     డిగ్గఁ ద్రోచి తోడన డిగ్గి స్రగ్గఁ గేల, గ్రుమ్మె నుసుఱుపోవంగ సక్రొధలీల.145
వ. ఇట్టి బెట్టిదంపుఁజెయిదంబున విగతప్రాణుం డైన కంసుని శరీరంబు రంగద్వారంబునఁ
     బరిఘాకారంబుగా నడ్డంబు దిగిచి కృష్ణుండు కంసుసోదరుం డగు సునాము దెసం
     జూచునంతకుమున్న ప్రలంబాంతకుం డెంతయు రయంబున నద్దురాత్ముం బొదివి.146
క. గొదగొని సారంగంబుం, బొదివినసింగంబుపగిది భూరిబలము పెం
     పొదవంగఁ జేరి చెండా, డి దురాలోకక్రియాపటిష్ఠత మెఱసెన్.147
వ. అప్పు డప్పుణ్యపురుషులమీఁదం ద్రిదశకరవిముక్తం బగు కుసుమవర్షంబు గురిసె
     దివంబున దేవదుందుభులు మొరసె మునుల యాశీర్వాదనినాదంబులును సిద్ధుల
     జయవచోనినాదంబులునుం బెరసి మేదురంబు లై వీతెంచెఁ బ్రత్యర్థిభంజన
     పారీణుం డైన యాపద్మనాభుండు గ్రక్కునం జను పెంచి కంసదళనకఠోరంబు లగు
     కరంబులఁ దండ్రిచరణగ్రహణం బొనర్చిన నతండు గాఢంబుగాఁ గౌఁగిలించి
     దీవించెఁ దల్లికి మ్రొక్కిన నుద్గతనవక్షీరమసృణస్తనం బగు నురంబునఁ గొడుకుం
     గడు బిగియం గదియించి శరంబు మూర్కొనియె నవ్విభుండు మఱియును.148
తే. ఉగ్రసేనునిఁ గని మ్రొక్కి యోలినఖిల, [1]వంశవృద్ధులకును మ్రొక్కి వారు దనకు
     నిచ్చుదీవనల్ గైకొని యింపుమిగులు, వాక్యముల నందఱను హర్షవనధిఁ దేల్చె.149
వ. తదనంతరంబ సకలజనంబులం బోవం బనిచి యగ్రజుండునుం దానును జనక
     మందిరంబున కరిగె బృందారకమునిసిద్ధగంధర్వాదులు గోవిందు విక్రమవర్ణనా
     పూర్ణమనోరథు లగుచు సురపథంబున నుండి నిజస్థానంబులకుఁ జని రంత.150
తే. దితిసుతాంతకు చేఁ జిక్కి దిక్కు లేని, పీనుఁగై రంగవాటంబు పెద్దబయలఁ
     బడిన యక్కంసుకడకుఁ దద్భార్య లెల్ల, నరుగుదెంచిరి వెస నంతిపురము వెడలి.151
వ. అప్పుడు.152
సీ. కరతాడనములఁ జన్గవలపై లత్తుక చట్టలుచఱిచినచాడ్పు దోఁపఁ
     దెగి రాలుహారమౌక్తికములు నశ్రుబిందువు లేర్పఱుపరాకఁ దొందడింపఁ
     నెండెడువాతెఱ నెసఁగుతాంబూలరక్తిమ శోకవహ్ని గ్రక్కెడు తెఱఁగుగఁ
     దూలెడుపయ్యెద దుఃఖాంబునిధిలోని కడలుచందంబునఁ గడలుకొనఁగ
తే. వీడి వెన్నుల వ్రేలేడివేణు లోలి, బెలసి కాలాహినిభములై సొలపుఁ జూపఁ
     బొదువుమూర్ఛల డెందంబు లుదిలకొలుప, [2]నలఁతకొలఁదికి మిగిలె నయ్యంగనలకు.153
క. అందఱుఁ బతిపైఁ బడి పెను, గ్రందుగ నఖిలాంగకములుఁ గనుగొని గౌఁగి
     ళ్లం దొడరఁగ ని ట్లని యా, క్రందన మొనరించి రధికకరుణధ్వనులన్.154
సీ. నృపగంధహస్తివై నీవన్యనృపగంధ మించుకంతయు సైప కింతదాఁక
     సార్వకాలికమదగస్ఫారవిశృంఖలలీల వర్తింపంగఁ గాలుఁ డాత్మఁ

  1. వంశ్యులకుఁ బ్రణమిల్లిన
  2. నలఁతకొలఁదికి మీరె నయ్యతివగమికి