పుట:హరివంశము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

227

     లగు నాజితకాశులం గని యుగ్రసేనసూనుం డుగ్రంబైన యాగ్రహంబునం
     బొమలు ముడివడఁ జెమట మొగంబున ముంపఁ గంపంబు సర్వాంగీణం బై
     యొలయం బెలయు నుచ్ఛ్వాసమారుతంబునం బ్రేరితం బైనట్లు పేర్చిన యుల్లం
     బునఁ బేర్చు క్రోధానలంబు పెనుమంటలపగిది నిగురు నాలోహితలోచన
     రోచులు రంగప్రదేశంబెల్లం బ్రదీప్తంబు సేయ నలుదిశలు నాలోకించి నిజకింకర
     గణంబుఁ బిలిచి యాగొల్పడుచుల నిద్దరం దిగిచికొనిపోయి నగరి వెడలం
     ద్రోవుఁడు నందగోపునిం బట్టి బెట్టిదంబుగాఁ బెక్కుసంకిలియలం బెట్టుండు తక్కిన
     గోషకులను దలలుగోసి వైవుండు నారాజ్యంబున గొల్లం డెవ్వండు మెలంగిన
     మ్రుచ్చులు వడు పాట్లం బఱుచునది గొల్లకుం గల సొమ్ము లన్నియుం బుచ్చి
     కొనునది నాకు నెగ్గొనర్ప వేచియున్న యన్నీచుం గుటిలస్వభావు వసుదేవు
     ముదుసలివారికిం దగని ఘోరక్రూరదండంబున దండితుం జేయుం డని యాజ్ఞా
     పించిన.138
తే. తలఁకి యున్నవా రున్నచోఁ దలలు [1]గట్టి, కొనిరి మఱి ప్రాణములు గుత్తుగుత్తనంగ
     జనని శోకంబు గ్రమ్మఱఁ గన్నుఁ బొదువ, దేవకీదేవి మూర్ఛావిధేయ యయ్యె.139

శ్రీకృష్ణుఁడు కంసునిఁ బుడమిం బడవైచి విగతప్రాణునిఁ జేయుట

చ. కలఁగెడుతల్లిదండ్రులును గారియఁ బొందెడుబంధువర్గమున్
     సొలయుసభాజనావళులఁ జూచి విపక్షపశూపహారసం
     కలనము గ్రోధదేవతకు గ్రక్కునఁ జేయఁ దలంచి రూఢగ
     ర్వలసితబాహుదుస్సహుఁడు వైరిసమాప్తి యొనర్చుతెంపునన్.140
చ. కరిపతి యున్నశైలకటకంబునకుం బటువేగచండమై
     హరిపతి దాఁటునట్లు హరి యారిపుఁ డున్నయుదగ్రసౌధమం
     దిరవలభీతటంబునకుఁ దీవ్రత నుప్పరవీథి దాటి ని
     ర్భరపవనప్రకంపవిచరన్నవనీలవలాహకాకృతిన్.141
తే. రంగమధ్యంబునందుండి రాజుదెసకు, నుఱుకు కృష్ణువేగస్ఫూర్తి యొక్కరుండు
     గానలేకున్కిఁ గనుమాయ కరణియయ్యెఁ, గంసుముందర నిలుచుండఁ గనిరి మరల.142
క. భువిమీఁదఁ గృష్ణుఁ డుండఁగ, దివి వేఱొకకృష్ణుఁ డుప్పతిల్లిపడుటగా
     దివిజారి తలఁచి తలఁకున, నవయవములు సడలఁ బ్రచలితాసనుఁ డయ్యెన్.143
వ. ఆలోన నయ్యదువీరుండు.144
సీ. మణులు [2]రాలఁగఁ జారుమకుటంబు వడ దన్ని వడివెండ్రుకలు వట్టి వ్రాలఁ దిగిచి
     నడుతల యందంద పిడికిట మెదడును గలగంగఁ బొడిచి మ్రోఁకాల నురము
     దాఁకింప నొక్కచేతయఁ జేయలేక నిశ్చేష్టుఁ డై రోజు నిర్జీవుఁ బెలుచ
     హారముల్ ద్రెవ్వఁ గర్ణావతంసము లూడ నత్తఱి నుత్తరీయంబు వీడ

  1. గుట్టి, కొనిరి నఱిబ్రాణములు
  2. జారఁగ