పుట:హరివంశము.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము. ఆ, 9.

225

తే. పగయ పాటించి వీనిఁ జంపంగఁ దలఁచి, యేను గదిసితి మెచ్చింతు నిట్టు లున్న
     యిందఱును జూడుఁ డూరక యిట్టునట్టు, ననక లావును విక్రమవ్యాప్తి వెరవు.123
వ. [1]కరూశదేశంబునం బ్రభవించి చాణూరుం డనఁ బ్రసిద్ధుం డైనవీనిచేతఁ బెక్కండ్రు
     మల్లులు [2]సిక్కిరి వీనిం బడవైచి యసాధారణం బగుయశంబుఁ బొందెద ననియె
     నిట్లు భాషించి యప్పురుషభూషణుండు విద్వేషిం దలపడినం బెనకువ బెట్టిదం
     బై చెల్లె నంత.124

శ్రీకృష్ణుఁడు చాణూరుం డనుమల్లునితోఁ బోరి వానిం జంపుట

తే. సకలవిజ్ఞాననిధి యగుశౌరి పేర్చి, యహితుచేతఁ జిరాభ్యస్త యైనవిద్య
     కగ్గలంబుగఁ దాను నభ్యస్తవిద్యుఁ, డయ్యుఁ జూపె విచిత్రమార్గాంతరముల.125
క. తిగుచుట త్రోచుట క్రుంగుట, నెగయుకు యెదుఁగుట తొలంగి నిలుచుట సరిగా
     నగధరుఁగునుఁ జాణూరుఁడు, దగిలి తిరుగువిధము లద్భుతము లై యొప్పెన్.126
తే. మూఁపు లొండొంటిఁ దాఁకించు మ్రోత పెల్లుఁ, దలయుఁ దలయును సంధించునులివు పెంపుఁ
     బటుమిధోముష్టిపాతనిర్భరరవంబుఁ, గలసి వజ్రనిర్ఘోషానుకారి యయ్యె.127
క. అఱచేతం బెడగేలన్, జఱిచియుఁ గూర్పరకఠోరజానునిహతులన్
     బఱచియు వారు సముద్ధతిఁ, బఱివోవక పోరి రలఘుపాటవదృఢతన్.128
తే. తఱిమి మెడలంటఁ బట్టుట తమక మొప్ప, దంతనఖరవిదారణదారుణముగఁ
     గడఁకగల్గుట దొడగాళ్లు లడఁచిత్రోచు, టిరువురందును నుగ్రమై యెసఁగెఁ జూడ.129
వ. ఇన్నిచందంబులం జాణూరుకంటె నతిశయంబు చూపుచుఁ గృష్ణుం డప్పటప్పటికి
     సభాసదుల మెప్పించుచుండ నొండొండ మేలు మే లను నెలుంగులు రంగవలభిఁ
     బ్రతిశబ్దద్విగుణితంబు లయ్యెఁ దదనంతరంబ మొగంబునఁ గోపంబు చెమట
     తోడం జేవుఱింపఁగఁ గంసుండు చేసన్న నామ్రోఁత యుడిపి మృదంగాదివాదిత్ర
     నాదంబులను వారించె నవ్వారిజేక్షణురణం బంతరిక్షంబున నంతర్దానగతు లై
     కనుంగొను ననిమిషుల ఋషుల సాధువాదనినాదంబులును గంధర్వకరతాడన
     తరంగితంబు లగుమృదంగనినదంబులుం జాణూరభంజనంబున జగంబులం గావు
     మనుసిద్ధవిద్యాధరాదుల జయజయశబ్దపూర్వప్రార్థనావచోవిరావంబులు నవా
     ర్యంబు లై యుల్లసిల్లె నంత.130
ఉ. చూపఱకోర్కె నిండ రిపుశూరతకుం జనవిచ్చి కొంతసేఁ
     పాపగిదిన్ భుజాసమర మచ్చెరు వారఁగ నిర్వహించి యా
     గోపభటుం డొకింత యెడఁ గోపముఁ గైకొని వైరిసత్త్వవి
     ద్యాపటురూఢి యెంతయును దక్కువగా నొనరించె వ్రేన్మిడిన్.131

  1. చారుకం బనుప్రదేశంబున
  2. గ్రుస్సిరి (బ్రౌను పాఠము)