పుట:హరివంశము.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

217

క. ఆబెడిదపుమ్రోఁతకుఁ గా, దే బమ్మెరపోయి దేవ దేవరనగరన్
     వే బెండుపడిరి మొగముల, పై బెగ్గలికంబు దేఱఁ బరిజను లెల్లన్.49
తే. కట్లుఁ గంబంబు విఱుచునుగ్రంపుగజము, నట్టు లవ్విల్లు విఱిచి యయ్యక్కజుండు
     పవనుచందంబుగతిఁ బట్టుపడకతూఱి, పోయెఁ దోడియాతఁడుఁ దాను భూపసింహ.50
క. అని విలువిఱుచుట సెప్పఁగఁ, దనవీఁ పటు విఱిగినట్లు తల్లడ మెసఁగన్
     జనపతి వారల నటపోఁ, బనిచి విషాదోరుచింతఁ బడి యాకులుఁడై.51
వ. అంతకుమున్న రామకేశవులం గానుపించుకొనునప్పటికి నాయితంబులు సేయించిన
     ప్రేక్షాగారంబులు వీక్షించువాఁ డయి వెలువడియె నవియును రాజునకు నమా
     త్యులకు భూపతులకు బాంధవులకు భృత్యులకుఁ బౌరశ్రేణులకు విలాసినులకు
     మఱియుం దగినవారి కెల్లను వేర్వేఱ కావించిన తమగంబుల దృఢరమ్యరచనంబు
     లగుమహాస్తంభంబుల నున్నతంబు లగునుపరిగృహంబులను సుఖారోహణంబు
     లగుసుసంఘటితసోపానమార్గంబుల నతివిశాలంబు లగువలభిముఖంబులఁ బ్రత్య
     గ్రకల్పితంబు లగువిచిత్రశిల్పంబుల నాలోకనీయంబు లగువితానయవనికాతో
     రణప్రముఖంబుల నలంకృతంబు లై యుల్లసిల్ల ననేకపురుషరక్షితం బై యపార
     వస్తుభరితం బై యామోదికుసుమపరికీర్ణస్థలం బై యభిరూపధూపవాసితం బై
     భాసిల్లునట్టిరంగంబు గనుంగొని.52
క. అతఁ డఖిలకర్మకరులకు, వితతంబుగ వలయుభంగి వినియోగంబుల్
     ప్రతిభ యెసఁగఁ బనిచి సము, ద్యతమతియై మగుడఁ జొచ్చె నంతఃపురమున్.53
వ. అచ్చటనుండి చాణూరముష్టికు లనుమల్లవరులఁ బ్రసిద్ధసత్త్వులం బిలిపించి
     యి ట్లనియె.54
ఉ. మల్లుతనంబునన్ భువనమండలివీరపతాక [1]మీకయై
     చెల్లుఁ బ్రియంబుతోడ ననుఁ జేరినకోలెను నే నొనర్చు మే
     లెల్లను మీ రెఱుంగుదుర యింతటఁ బ్రత్యుపకారకాంక్ష సం
     ధిల్లెన యేని నాపలుకు దెల్లముగా వినుఁ డేకచిత్తతన్.55
మ. బలుఁడుం గృష్ణుఁడు నాఁగఁ జెప్పఁబడుగోపాలార్భకు ల్గానన
     స్థలిలోఁ [2]గారెఱుకుందనంబునన యిందాఁకం బ్రవర్తిల్లినా
     రలఘుస్థైర్యము ధైర్యమున్ మొదలుగా [3]నయ్యైభటౌచిత్యముల్
     గలయం దైన నెఱుంగ రెంతయును మౌష్కర్యంబు శీలించుటన్.56
శా. ఈరంగంబున వారు మీకు నెదురై యేమేనిఁ జెయ్దంబుమైఁ
     జేరం జూతురు మీరు గైకొనమితోఁ జేపట్టి పాలార్చుచున్
     గారింపన్ వల దొక్కపూఁపునన యాఘాతించి నాకున్ మహో
     దారం బైనశుభం బొనర్పుఁడు భవత్ప్రఖ్యాతి నిండారఁగాన్.57

  1. లీనమై
  2. గ్రాలెడు కుందనంబునన
  3. నాయోధనౌచిత్యముల్