పుట:హరివంశము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

213

     గనుఁగొనినంతమాత్రన విఖండితశీలత నొంది రెల్లభా
     మినులును సోయగంబు లుపమింపఁగ నిట్టివి యెందుఁ గల్గునే.8
క. తగిలినచూడ్కులు మగుడం, దిగువఁగ లే మైతి మేమి తెఱఁగో యింకీ
     [1]సుగుణత తనుపుచు నెనసిన, పగిది మనోభావ[2]మోహపఙ్క్తులు గొనియెన్.9
మ. అని యెవ్వా రెచటం గనుంగొనిరి వా రచ్చోన కందర్పమో
     హన బాణంబుల కగ్గమై వికచనేత్రాంశుచ్ఛటాలోల[3]నీ
     లనవేందీవరపత్త్రతోరణలతాలంకారత ల్వీథినెం
     దును బర్వం బరతంత్రలైరి వెసఁ దద్రూపాతిసంగంబునన్.10
వ. సమానవయస్కు లగు పౌరకుమారు లక్కుమారులం గని యుత్సుకభావంబులు
     దిగువం దగిలి తోడన వేడుకం జని రిట్లు మధురాపురంబునకు నాక్షణంబున నిజ
     వీక్షణక్షోభం బొనరించుచు నయ్యదుకుంజరు లొయ్యనఁ బరిక్రమించి ముందట.11
తే. పలుదెఱంగుల మడుఁగుఁజీరలు పొలుపుగ, మడిచి మూటగఁగట్టి యింపడరఁ గొనుచు
     నరుగురజకుని రంగకారాఖ్యుఁ గాంచి, రపుడు వాని నుద్దేశించి యచ్యుతుండు.12
క. ఏమి మెడవాల! యే మీ, భూమీశ్వరు నర్థిఁ గానఁ బోయెదము సభా
     భూమికిఁ జనియేడువారికి, శ్రీ మేటిల్లంగ మంచిచీరలు వలయున్.13
వ. కావున నీచేతి మంచిమడుఁగులు మా కిచ్చి లెస్సవాఁడ వగు మనిన వాఁడు
     గోపించి.14
తే. అడవిలో గొల్లమందలయందుఁ బెరిఁగి, నారు లౌకికం బేమియు నేర రెఱుఁగఁ
     గంసనరనాయకుఁడు వేడ్కఁ గట్టుచీర, లడుగునంతటివారె మీ రకట యిట్లు.15
క. నానాదేశంబుల ధర, ణీనాథులు కట్నమిచ్చి నెఱిఁ బుత్తేరం
     గా నెందును బహుమూల్యము, లై నెఱసినయట్టి వివి జనాధిపుమెచ్చుల్.16
క. ప్రేలరులై వెడయఱపుల, నాలిగొనక పొండు తొలఁగి యనవుఁడు నాదు
     శ్శీలుమెడమీఁదఁ గృష్ణుఁడు, [4]వే లీలం గత్తి పెట్టి వ్రేసెం గినుకన్.17
వ. ఇట్లు వేసిన.18
తే. ఉసుఱు సిరియును నొల్ల కిట్లొఱటుఁజాకి, యాదిదేవునిదెస వినయంబు దక్కి
     యిహపరమ్ములు లేక [5]యి ట్లేగె భగ్న, కంఠుఁడై నేలపైఁ గూలి కాలుఁ గూడ.19
వ. వాని యాండ్రెందఱేనిం దలలు వీడం బఱతెంచి యఱచుచు రాచనగరికిం జెప్పఁ
     బోయిరి పరమపురుషుం డాచీరలకట్ట విడిచి కనకభంగపిశంగంబు లైన పరిధానం
     బులు దాను గట్టుకొని కువలయశ్యామంబు లైనవి రామున కిచ్చి తక్కిన చీర
     లక్కడం జూడవచ్చిన వేడుకకాండ్రకు వెఱవక కట్టుకొం డని కొన్ని యిచ్చి

  1. సుగుణతనువున చుబుకచుం, బగతి; సుగుణతనువున బకళిలన్, తగిలి.
  2. లోహ
  3. లీల
  4. లీలంగా
  5. యి ట్లెరగి