పుట:హరివంశము.pdf/245

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - అ. 8.

197

తే. డాదిదేవుఁ డిప్పుడు గొల్లఁ డై ముదమునఁ, బీలిదండ నెట్టెముసుట్టి పిల్లఁగ్రోలు
     కేలఁ బట్టి గోవులబడిఁ గేలిసలుపఁ, జూడఁ గంటి నా కిది యేమి సుకృతఫలమొ.80
శా. ఏ నచ్చోటికి నెమ్మిఁ బోఁ దడవ సర్వేశుండు సర్వాదరా
     మానం బైన విలోకనం బొలయ న న్నొక్కింత భావించిన
     ట్లైన న్నాజననంబు ధన్యము త్రిలోకార్చ్యుండ నే నొక్కఁడన్
     గానే సంయమికాంక్ష్య మిప్పరమమాంగల్యంబు సామాన్యమే.81
క. బలభద్రసహితుఁ డగు నా, జలజాక్షుఁడు నేఁడు నాకు సన్నిధియగు వీ
     డ్కొలిపెద నింతటితోడం, గలుషజరామరణబహుళకర్మజ్వరమున్.82
క. అని తనలో నుప్పొంగుచు, ననఘుఁడు కృతకృత్యుం డగుచు నక్రూరుఁడు స
     య్యనఁ గంసుని నామంత్రణ, మొనర్చి పురి వెడలె నపుడ యుత్సవలీలన్.83
వ. ఇక్కడఁ గంసుండు నివ్విధంబున వసుదేవు నధిక్షేపించి యాడినమాటల కందఱు
     యదుప్రవృద్ధులుఁ జెవులు మూసికొనుచు నిద్దురాత్మునకుం గాలంబు నిండె
     నని తలంచి రందులోన నంధకుం డను పేరు గల యాదవస్థవిరుం డాయౌగ్రసేని
     నాలోకించి యి ట్లనియె.84
ఉ. అక్కట రాజవంశమునయందు జనింపనివానియట్లు నీ
     వెక్కడనేనిఁ గల్గి యిటు లేమిటి కేనియు వచ్చినట్లు శ్రీ
     దక్కి వనంబులో జడలు దాల్పఁగ బోయెడునట్లు బుద్ధి నొం
     డొక్కటి సూడ కిమ్మెయి దురుక్తుల నొంచితె వృద్ధబాంధవున్.85
ఆ. నీకు వగవ వలదు నీవు పుత్రుఁడవు గాఁ, దొల్లి నోఁచినట్టితల్లితండ్రు
     లధిక శోచ్యు లన్వయాంతకారివి నిన్నుఁ, గనినకుల[1]ము నిందఁ జనుట యరుదె.86
క. తనుఁ దాన పొగడికొనినను, గనునే నిజగుణము నధికగౌరవమును స
     జ్జనసేవ్యము లై యవి పే, ర్చినఁ గలుగుం గాక యెందుఁ జిరతరమహిమల్.87
శా. నీకుం జూడఁగ నీదుమాటలు కడు న్నిక్కంబు లై సత్యమ
     న్లోకౌచిత్యముఁ దప్పకున్నకరణి న్శోభిల్లె నీభంగి నెం
     దే కార్యంబు ఫలించె నీవ చెపుమా యేవంబుగా నాత్మమ
     ర్మాకారస్థితి[2]తోడ బేలుపడి తిట్లైరే నృపుల్ ప్రాక్తనుల్.88
క. తగ వెఱిఁగి మానఘనుఁ డై, నెగడి యనవలిప్తమార్గనిష్ఠుఁ డగుబుధున్
     మొగము సెదరంగఁ బలుకుట, జగతీసురవధముతోడి సరి యని రార్యుల్.89
క. విను వంశవృద్ధు లభిపూ, జనములకును భాజనములు సత్క్రతు వగు న
     య్యనలములయట్ల వారల, కనలుట భస్మీకరించు ఘనునైన వెసన్.90
తే. జలములోన మత్స్యంబులు మెలఁగుజాడ, లెఱుఁగరానిచందమ బుధు లిచ్చనడచు
     తెరువు లన్యుల కెఱుఁగుట యరిది వానిఁ, దాను శాంతుఁ డై దాంతుఁ డై తడవవలదె.91

  1. మ దింతగనుట
  2. యెల్లఁ బెల్పఱచి