పుట:హరివంశము.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 8.

195

     దేవతలచేతం బూజ గొనియె నాకృష్ణుండును వసుదేవసుతుం డగుటం జేసి
     వాసుదేవుం డనం బ్రఖ్యాతి నొందెడు నిట్లు మిత్రవ్యపదేశంబునం బరఁగు
     శత్రుండు దా నైన వసుదేవుండ యింతకు మూలభూతంబు.65
చ. వడిఁ దలఁ ద్రొక్కి ముక్కున నవారణఁ గన్నులు రెండు దొల్ప బ
     ల్విడిఁ దమకించువాయసములీల మదీయసమీపవర్తి యై
     యుడుగక నాకుఁ గీడు గడునుగ్రముగా నొనరించె దాయపుం
     జెడు గితఁ డేమి సేయనగుఁ జెన్నఁటిచుట్టపుసంజ్ఞ యుండఁగన్.66
చ. మనిచితిఁ దన్ను నీగియును మన్ననయుం బొదలంగ నేను దా
     ననయము నింతయుం దలఁప కంతకతుల్యవిచారుఁ డయ్యె ని
     య్యన యిటు నా దెస [1]న్వినక యాత్మ నకల్మషునందుఁ గల్మషం
     బెనయ నొనర్చుకంటెఁ గలదే భువిఁ బాతక మెవ్విధంబునన్.67
తే. భ్రూణహత్యాదు లగుపాపములకు నవధి, గలదు గాని కృతఘ్నునికలుషమునకు
     నిష్కృతి [2]యంతంబు లేనితీవ్ర, నరకపీడ సంప్రాప్య మన్నరున కండ్రు.68
వ. అని పలికి వసుదేవుదెసం గనుంగొని కంసుండు.69
సీ. కుల మింతయును నేను గొఱఁత యొక్కట నొందకుండంగ రక్షించుచున్నవాఁడ
     నిట్టినాయెడఁ బాప మిమ్మెయిఁ బుట్టించి తులువ నీ వెంతయు ద్రోహి వైతి
     యెట్లుగా ముదిసితి యేమిగాఁ బెద్దవైతో కాని యెఱుఁగ నీ యున్నయూర
     నైనలే దీవు మిథ్యాశీలుఁడవు మృషాశ్రయుఁడ వనర్ధధీసంయముఁడవు
తే. నీవిచార మే నెఱిఁగితిఁ గావరమునఁ, దొడరి నన్నుఁ జంపించి నీకొడుకు రాజుఁ
     జేసి మధుర యేలింపఁ జూచెదవు [3]జాల్మ, మెట్టునకు జన్నెతరములు [4]పెట్టిచూడ.70
శా. నాకేశుం డయినన్ బినాకధరుఁ డైన న్నాకు మాఱై రణో
     త్సేకంబుం బ్రసరింప నోపమి మదిం జింతింప ని ట్లేటికిన్
     నీ కీదుర్వ్యవసాయ మొక్కపడుచున్ వే తెచ్చి పోరించి యే
     శ్రీకిం బాత్రమవై తనర్చెదవు నీచే నేల యౌ నప్పనుల్.71
వ. నీవు చక్రవర్తివంశంబున జనియించి బాల్యంబునంగోలెను మాతండ్రియ పెంపం
     బెఱిగి మా తోఁబుట్టువునకుం బెనిమిటి వై యాదవులు గురుస్థానంబుగాఁ
     బాటింపం బరఁగి సజ్జనులలోన నెన్నిక గని పిదప నిన్నీచకర్మంబునకుం జొచ్చితి వీ
     వెట్టివాఁడ వైన నగుదుగాని యే నిన్ను వధియింప నోప నింతకమున్ను బంధు
     వృద్ధమిత్రద్విజవధంబులు సేయ నింకం జేయంగలవాఁడనుం గాను నీ చేయుదుర్న
     యంబులవలన మేలువచ్చినం గీడొందిన నది దైవకృతం బనీియుండెదఁ ద్వదీయం
     బగుదౌరాత్మ్యంబు కులంబువారికిం దలవంపు గావించె నింతియ కృష్ణునకు
     నాకు [5]నిట్లు పొడమినరాయిడి మాయం దొక్కరుండు శాంతిం బొందక శాంతి

  1. న్వినరె
  2. యడ్డంబు
  3. వీవు
  4. పెట్టఁజూడ
  5. నిట్టు లొడమిన